H3N2 Virus: జ్వరంతో కాన్పూర్ విలవిల.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం..

H3N2 Virus: ఇన్ ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా లక్షణాలు ఉండటంతో జనాలు భయపడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ నగరం జ్వరంతో అల్లాడిపోతోంది. అక్కడ దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాన్పూర్ లోని హాల్లెట్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క రోజులోనే జ్వరంతో, ఇతర జలుబు లక్షణాతో 200 కేసులు వచ్చాయి. వీరిలో 50 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులకు కూడా జనాలు పోటేత్తుతున్నారు. ఇన్ ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ వ్యాపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వారాల పాటు లక్షణాలు..
ఈ వైరస్ సోకిన వారిలో వారాల పాటు లక్షణాలు ఉంటున్నాయి. రోగులకు ఈ కింది లక్షణాలు ఉంటున్నాయి.
జ్వరం
చలి
దగ్గు
వికారం
వాంతులు
గొంతు మంట
కండరాలు మరియు శరీర నొప్పులు
అతిసారం
Baca juga
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
సబ్బు మరియు నీటితో తరచుగా మీ చేతులను కడగాలి.
ఫేస్ మాస్క్‌లను ఉపయోగించండి మరియు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి.
మీ పెదవులు మరియు ముక్కును తాకడం మానుకోండి.
తుమ్మినప్పుడు మరియు దగ్గినప్పుడు, మీ నోరు మరియు ముక్కును సరిగ్గా కప్పుకోండి.
ఎక్కువ నీరు త్రాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండండి.
మీకు జ్వరం మరియు శరీర నొప్పి ఉంటే పారాసెటమాల్ తీసుకోండి.
హ్యాండ్‌షేక్ ఇవ్వడం మానుకోండి
వీధుల్లో ఉమ్మివేయవద్దు.
వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే రోగి యాంటీబయాటిక్స్ లేదా ఏదైనా ఇతర మందులను ఉపయోగించాలి.
Post a Comment
Post a Comment