Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. రూ.83 వేలకు చేరువలో వెండి


బంగారం పరుగులు పెడుతోంది. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారానికి మరింత రెక్కలొస్తున్నాయి. అయితే భారతీయ సంప్రాదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆపరు. శుభకార్యాలు, ఇతర సందర్భాలలో షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ధరలు ఒక రోజున పెరిగితే మరో రోజు ఆగకుండా పరుగులు పెడుతోంది. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా మే 5న శుక్రవారం దేశీయంగా బంగారం వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.500 పెరుగగా, 24 క్యారెట్ల బంగారంపై రూ.640 పెరిగింది. ఇక వెండి కిలోపై రూ.300లకుపైగా ఎగబాకింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి
☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,730.
☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180.
☛ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,330.
☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,230.
☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180.
☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180.
☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,180
వెండి ధరలు:
చెన్నైలో కిలో వెండి ధర రూ.82,800, ముంబైలో రూ.77,100, ఢిల్లీలో రూ.77,100, కోల్‌కతాలో రూ.77,100, బెంగళూరులో రూ.82,800, హైదరాబాద్‌లో రూ.82,800, కేరళలో రూ.82,800 విజయవాడలో కిలో వెండి ధర రూ.82,800 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/o38q7Me
Related Posts
- America: శభాస్ చిన్నోడా.. ఏడో తరగతి పిల్లాడు.. 67 మంది ప్రాణాలు కాపాడాడు..
- Rohit Sharma Birthday: రోహిత్ శర్మ బర్త్‌డేకు స్పెషల్ సర్ప్రైజ్.. హైదరాబాద్‌లో 60 అడుగుల ఎత్తైన కటౌట్..
- Rashi Phalalu: వారికి దీర్ఘకాల వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.. 12 రాశులవారికి శనివారం రాశిఫలాలు..
- Health Tips: చల్లదనం కోసం రాత్రి 10 గంటల తర్వాత స్నానం చేస్తున్నారా ?.. హయిగా నిద్రపట్టడం కాదు.. మొదటికే మోసం వస్తుంది.. జాగ్రత్త..
- IPL 2023 Points Table: లక్నో విజయంతో మారిన పాయింట్ల పట్టిక.. మీ ఫేవరేట్ టీం ఏ నంబర్లో ఉందో తెలుసా?
- DC vs SRH Match Report: 5 రోజుల్లోనే ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న హైదరాబాద్.. 3వ విజయంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవం..
Post a Comment
Post a Comment