Hyderabad: జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్ స్టేషన్లు.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంట నగరాల పరిధిలో పటిష్ట పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, కొత్తగా 6 డీసీపీలను నియమిస్తూ ఉన్నతాధికారులు జీవో జారీ చేశారు. హైదరాబాద్‌లో 12 మంది ఏసీపీ డివిజన్లు ఏర్పాటు చేయగా.. సైబరాబాద్‌లో 3 డీసీపీ జోన్లు ఏర్పాటు చేయనున్నారు.. ప్రతి జోన్‌కు మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 11 లాఅండ్‌ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు.. ప్రతి ఏరియాలో సైబర్ క్రైమ్, నార్కొటిక్ వింగ్ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 2 టాస్క్‌ఫోర్స్ జోన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్‌లో మేడ్చల్, రాజేంద్రనగర్ జోన్‌లు, రాచకొండలో మహేశ్వరం జోన్ ఏర్పాటు చేయనున్నట్లు జీవో జారీ చేశారు.
కొత్తగా దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడి మల్కాపూర్, ఫిలింనగర్, మధురానగర్, మాసబ్ ట్యాంక్, బోరబండలో కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్‌లో మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూర్, జినోమ్ వ్యాలీ కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు జీవోలో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/aszmj9V
Post a Comment
Post a Comment