చిరంజీవి చేతిలో ఉన్న ఈ చంటోడు ఇప్పుడు ఓ స్టార్‌ హీరో.. అమ్మాయిల్లో పిచ్చ ఫాలోయింగ్.. చెర్రీ మాత్రం కాదండోయ్‌

Megastar Chiranjeevi

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా స్వయంకృషితో ఎదిగిన వాళ్ల జాబితాలో మెగాస్టార్‌ చిరంజీవి ముందుంటాడు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిరు ఆతర్వాత స్టార్‌ హీరోగా మారిపోయారు. సూపర్‌ హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ హీరోగా మారిపోయారు. ఇక ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ మెగా ఫ్యామిలీ నుంచి అరడజనకుపైగా హీరోలు వచ్చారు. పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌, మెగా బ్రదర్‌ నాగబాబు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌.. ఇలా వీరందరూ టాలీవుడ్‌లో హీరోలుగా రాణిస్తున్న వారే. ఇకపై ఫొటోలో క్యూట్ లుక్స్‌ కనిపిస్తున్నది కూడా ఓ మెగా హీరోనే. అయితే అతను మిగతా అందరి కంటే భిన్నంగా సినిమాలు చేస్తాడు. వైవిధ్యమైన పాత్రలకు పెద్దపీట వేస్తాడు. ప్రయోగాలకు సై అంటాడు. ఇక అతని ఫిట్‌నెస్‌ లెవెల్స్ అయితే నెక్ట్స్‌ లెవెల్‌. ఆరడుగుల ఆజానుబాహుడిలా కనిపించే ఆ హీరోకు అమ్మాయిల్లో పిచ్చ ఫాలోయింగ్‌ ఉంది. ప్రేమకథలతోనే ఎక్కువగా ఆకట్టుకున్నా మాస్‌ చిత్రాలోనూ మెప్పించాడు. ఇంతకీ ఇతనెవరో కాదు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌.

ముకుంద సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయమైన వరుణ్‌ ఆ ద్వారా కంచె సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత లోఫర్‌, ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్‌2, గద్దల కొండ గణేశ్‌, ఎఫ్‌3 సినిమాలతో స్టార్‌ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు (జనవరి 19) వరుణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు అతని చిన్ననాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తెగ హంగామా చేస్తున్నారు. అందులోదే ఈ ఫొటో. మెగాస్టార్‌ గెటప్ చూస్తుంటే ఇది ముగ్గురి మొనగాళ్లు సినిమా సమయంలో తీసిన ఫొటో తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/IhbuLfv

Baca juga

Post a Comment