Allu Arjun : తమిళ్ స్టార్ దర్శకుడితో ఐకాన్ స్టార్ మూవీ.. బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ దర్శకుడు ఎవరంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun )సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండదు. పుష్ప సినిమా వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. బన్నీ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ గా వచ్చిన పుష్ప సినిమా బ్లక్ బస్టర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే పుష్ప 2 సినిమాను మొదలు పెట్టనున్నారు సుకుమార్. ఈ సినిమాతో పాటు వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ మూవీకి ఐకాన్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు కూడా.. కానీ ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ గ్యాప్ లో బన్నీ కొరటాల శివ తో కూడా ఓ సినిమా చేయదని రెడీ అవుతున్నాడు.
ఈ సినిమను కూడా గతంలో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఊసే లేదు. అయితే పుష్ప సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయనున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బన్నీ ఓ స్టార్ దర్శకుడితో సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. తమిళ్ స్టార్ దర్శకుడు మురగదాస్ తో అల్లు అర్జున్ సినిమా ఉండనుందని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే మురగదాస్ సూపర్ స్టార్ రజినీకత్ తో దర్భార్ సినిమా తెరకెక్కించారు. ప్రస్తుతం మురగదాస్ సూర్య నటించిన గజినీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారని కోలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో మురగదాస్ బన్నీతో సినిమా చేయనున్నాడని టాక్ కూడా గట్టిగా మినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
kangana Raunaut: ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన కంగనా రనౌత్.. దాని ధర ఎంతంటే..?
NTR Movie: 20ఏళ్ల కల నెరవేరిందంటున్న కేజీఎఫ్ డైరెక్టర్..ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..ట్విట్స్ వైరల్
JR. NTR Fans Hungama: అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటి వద్ద అసలేం జరిగింది..? పోలీసు లాఠీ ఛార్జ్ ముందు పరిస్థితి ఎంటీ..? వీడియోలు వైరల్
from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/0HQ2onN
Post a Comment
Post a Comment