Hyderabad: రెచ్చిపోయిన కేటుగాళ్లు.. వృద్ధులని కూడా చూడకుండా..

Cyber Fraud

Hyderabad: నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీ లో నివాసముండే రఘునాథన్ అయ్యంగార్ (78) సంవత్సరాల వృద్ధుడిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు 6 లక్షల 87 వేల రూపాయల నగదును కాజేసిన సైబర్ కేటుగాళ్లు.

నేరేడ్మెట్‌కు చెందిన రఘునాథన్ అయ్యంగార్ తన ఎస్.బి.ఐ బ్యాంకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ మర్చిపోవడంతో దానిని రీసెట్ ఎలా చేయాలని గూగుల్ లో సెర్చ్ చేశాడు. సైబర్ కేటుగాళ్లు ఎలా పసిగట్టారో దీనినే అదునుగా తీసుకుని బాధితుడికి ఫోన్ చేసి మేము ఎస్.బి.ఐ బ్యాంకు నుండి మాట్లాడుతున్నాం మీ పాస్ వర్డ్ మార్చుకోమని వాళ్ళే ఒక పాస్ వర్డ్ ను చెప్పారు. వాళ్ళ మాటలు నమ్మిన బాధితుడు వాళ్ళు చెప్పినట్లు చేసి రెండు విడతలుగా మొత్తం 6.87 లక్షల రూపాయలను అతని అకౌంట్ నుండి కొట్టేశారు. డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని విషయం తెలుసుకుని వెంటనే బ్యాంకుకు విషయం తెలిపాడు. ఆన్లైన్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు, నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందుకున్న నేరెడ్మెట్ పోలీసులు బ్యాంకు సహాయంతో సైబర్ కేటుగాళ్ల కోసం వేట మొదలుపెట్టారు. ఈమధ్య కాలంలో ఇటువంటి సైబర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ప్రజలు ఎవరు కూడా ఇలా మోసపోవద్దని బ్యాంకు సిబ్బంది ఎప్పుడు తమ కస్టమర్లను ఓటిపి లు అడగదని తెలిపాయి. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా నేరెడ్మెట్ సి.ఐ నరసింహస్వామి తెలియజేశారు.



from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/ezRUxNS

Baca juga

Post a Comment