MI vs SRH IPL Match Result: ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్

Srh

MI vs SRH IPL Match Result: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. IPL 2022లో తమ 13వ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్‌ల అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టోర్నీలో ఆశలు సజీవంగా ఉంచుకోవాలని తహతహలాడుతున్న హైదరాబాద్ ఈ విజయంతో వరుసగా ఐదు పరాజయాల తర్వాత విజయాన్ని అందుకుంది. 13 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది ఆరో విజయం. అలాగే 13వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కి ఇది 10వ ఓటమి. గత మూడు వరుస మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ జోడీ ఈ మ్యాచ్ లో రాణించారు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్ల ధాటికి అడ్డుకట్ట వేసి 95 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ తన అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు. 48 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

రోహిత్ వికెట్ తర్వాత  ముంబై ఇన్నింగ్స్ తడబడింది. రోహిత్ వికెట్ తర్వాత హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. దాంతో వరుస వికెట్లు కోల్పోతూ ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఉమ్రాన్ హైస్పీడ్ బౌన్స్‌లతో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, డేనియల్ సామ్స్ వికెట్లను పడగొట్టాడు. మొత్తంగా నిర్ణిత 20 ఓవర్లలో హైదరాబాద్ 193 పరుగులు చేయగా.. ముంబై 190 పరుగులు చేసింది. ఈ విజయంతో ప్లేఆఫ్ కైవసం చేసుకుంది హైదరాబాద్ .

మరిన్ని ఇక్కడ చదవండి : 

IPL 2022: విజయోత్సాహంలో గుజరాత్‌ ఆటగాళ్లు.. వై దిస్‌ కొలవెరి డి అంటూ రచ్చ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

MI vs SRH Score: దంచికొట్టిన ఎస్ఆర్‌హెచ్.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న త్రిపాఠి.. ముంబై ఎదుట భారీ టార్గెట్..

MI vs SRH Highlights, IPL 2022: పోరాడి ఓడిన ముంబై.. మూడు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం



from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/cLH2GNU

Baca juga

Post a Comment