Pearl Farming: ముత్యాల సాగుని ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం.. అక్కడ ముత్యాలను పండించే రైతులకు భారీగా సబ్సిడీ..

Pearl Farming: సాంప్రదాయ వ్యవసాయం రైతుకు ప్రధాన జీవనాధారం.. అయితే రైతులు తమ వ్యవసాయాన్ని దండగ కాదు.. పండగగా మార్చుకోవాలంటే.. ఆధునిక పద్ధతులను అనుసరించాలి. ఇక వాణిజ్య వ్యవసాయం చేస్తే.. రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం రైతులకు ముత్యాల వ్యవసాయం లాభసాటిగా మారింది. అవును… మీరు విన్నది నిజమే.. అందంగా చందమామలా ప్రకాశించే ముత్యాలను రైతులు కృషితో పండిస్తున్నారు. తమ అదృష్టాన్ని కూడా ప్రకాశింపజేకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ముత్యాల సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఈ రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ ప్రభుత్వం కూడా చేరింది. ముత్యాలు పండించే రైతులకు రాజస్థాన్ ప్రభుత్వం రూ.12.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ముత్యాల పెంపకం అంటే ఏమిటి మరియు అది ఎలా చేయవచ్చో తెలుసుకుందాం. అదే సమయంలో.. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని రైతులు ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా తెలుసు.
రైతులు చెరువులను తయారు చేసి.. కల్చర్డ్ ముత్యాలను ఉత్పత్తి:
ముత్యాలను ఎలా పండించవచ్చో తెలుసుకునే ముందు.. ముత్యం అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. నిజానికి ముత్యాలు ప్రకృతిలో లభించే నవరత్నాలలో ఒకటి. ఇవి మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలలో తయారవుతాయి. మొదటగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేక మైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా రైతులు కృత్రిమంగా ముత్యాలను ఉత్పత్తి చేయవచ్చు. ఇందుకోసం రైతులు చెరువును నిర్మించి అందులో ఆల్చిప్పలను వేయాలి. ఈ ఆల్చిప్పలను మార్కెట్ నుండి కొనుగోలు చేయవచ్చు. కల్చర్డ్ ముత్యాలను ఇందులో ఉత్పత్తి చేయవచ్చు. ప్రాథమికంగా మూడు రకాల ముత్యాలు ఉన్నాయి. సహజ, కృత్రిమ, కల్చర్డ్ ముత్యాలతో సహా. కల్చర్డ్ ముత్యాలు అంటే సాగు చేసి తయారు చేసినవి.
రాజస్థాన్ ప్రభుత్వం ముత్యాల సాగుకు 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది
రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలో ముత్యాల సాగుకు 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. దీని కింద రాష్ట్రంలో ముత్యాలు పండించే రైతులు గరిష్టంగా రూ.12.50 లక్షలు సబ్సిడీగా పొందవచ్చు. రాజస్థాన్ ప్రభుత్వం నుండి అందిన సమాచారం ప్రకారం, ముత్యాల సాగుకు ఏడాది పొడవునా నీరు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కోటా డివిజన్‌లో ముత్యాల సాగుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముత్యాల సాగుకు హెక్టారుకు రూ.25 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో 50 శాతం సబ్సిడీ పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://tv9telugu.com/latest-news/rajasthan-government-is-giving-rs-12-5-lakh-to-pearl-farmers-find-out-how-to-get-benefits-pearl-farming-au58-705173.html
Post a Comment
Post a Comment