Ramcharan: శంకర్-రామ్‌చరణ్ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. చెర్రీ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా..

Ramcharan: రామ్‌చరణ్ హీరోగా శంకర్ (Shanker) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా (Pan India) రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ తాజాగా విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నెట్టింట నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తండ్రీకొడుకులు పాత్రల్లో చెర్రీ నటించనున్నాడని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. అయితే చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్ రోల్‌లో కాదని ఏకంగా ట్రిపుల్ రోల్‌లో నటించనున్నాడనేది సదరు వార్తల సారాంశం. తండ్రితో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లో రామ్ చరణ్ నటించనున్నాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో ఒకటి నెగిటివ్ రోల్ కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే చెర్రీ ‘నాయక్’ సినిమాలో డ్యూయల్ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. అయితే ట్రిపుల్ రోల్‌లో కనిపించడం ఇది తొలిసారి అవుతుంది. మరి ఈ వార్తలో నిజం ఉందా.? లేదా గాసిప్ రాయుళ్లు పుట్టించిన వట్టి పుకారేనా తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/6KZsY3b
Related Posts
- ONGC Recruitment: ఓఎన్జీసీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..
- SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
- Viral Video: పెళ్లి మండపానికి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన పెళ్లి కూతురు.. షాక్ అయిన బంధువులు..
- PM Narendra Modi: రూపుదిద్దుకుంటోన్న సరికొత్త భారతం.. మోదీ 8 ఏళ్ల పాలనలో జరిగిన అద్భుత నిర్మాణాలు..
- ITBP Recruitment: ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేల జీతం..
- Bald Head: బట్టతల ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక జుట్టు కోసం బెంగ అవసరం లేదు..!
Post a Comment
Post a Comment