RR vs DC, IPL 2022: దంచికొట్టిన మార్ష్, వార్నర్.. RRపై ఢిల్లీ సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం..

RR vs DC, IPL 2022: ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జూలు విదిల్చింది. బుధవారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ (RR vs DC)లో రాజస్థాన్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని రిషభ్ సేన 18.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. టీ20 ప్రపంచకప్ హీరోలు మిషెల్ మార్ష్ (89), డేవిడ్ వార్నర్ (52) ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కరోనా బారిన పడి ఫామ్ లేమితో తంటాలు పడుతోన్న మార్ష్ చాలా రోజుల తర్వాత తన బ్యాట్ పవరేంటో చూపించాడు. కేవలం 62 బంతుల్లోనే 7 సిక్స్‌లు, 5 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. మార్ష్, వార్నర్‌లు కలిసి రెండో వికెట్‌కు కేవలం 85 బంతుల్లోనే 105 పరుగుల జోడించారు. దీంతో ఢిల్లీ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. ఎప్పటిలాగే రిషభ్ పంత్ (4 బంతుల్లో 13) సిక్స్ తో మ్యాచ్‌ను ముగించాడు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (32/1), యుజువేంద్ర చాహల్ పర్వాలేదనిపించారు. రెండు వికెట్లు తీసుకోవడంతో పాటు సూపర్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీని విజయ తీరాలకు చేర్చిన మిషెల్ మార్ష్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (7) నిరాశపర్చాగా, గత మ్యాచ్ హీరో యశస్వి జైస్వాల్ (19) త్వరగానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే అశ్విన్ (50), పడిక్కల్ (48) రాజస్థాన్ టీం ను ఆదుకున్నారు. అయితే అశ్విన్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది ఆరెంజ్ ఆర్మీ. కెప్టెన్ శామ్సన్ (6), రియాన్ పరాగ్ (9), వాండెర్‌సన్ (12) నిరాశపర్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 160 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ తరపున చేతన్ సకారియా (23/2), అన్రిచ్ నోర్జ్టే (39/2), మిచెల్ మార్ష్ (25/2) సత్తాచాటారు.
Marsh and Warner registered the highest partnership for us this season as we aced the chase
#YehHaiNayiDilli | #IPL2022 | #RRvDC | #TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/NyFXqjB9mJ
— Delhi Capitals (@DelhiCapitals) May 11, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
RR vs DC Score: ఆకట్టుకున్న అశ్విన్, పడిక్కల్.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?
IPL 2022: 10 మ్యాచ్‌లు..116 పరుగులు.. ఫ్లాప్ షోలా మారిన రూ. 16 కోట్ల ప్లేయర్.. ఏకంగా టోర్నీ నుంచే ఔట్..
IPL 2022: 12 ఇన్నింగ్స్‌లు.. 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు.. రీ ఎంట్రీపై కన్నేసిన ఆ భారత ఆటగాడు.. పంత్ ప్లేస్ ఢమాల్?
from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/fP1Farz
Post a Comment
Post a Comment