Sai Pallavi: ఆ స్టార్ హీరో అంటే చెప్పలేని అభిమానం.. మనసులో మాట బయట పెట్టిన సాయి పల్లవి

Sai Pallavi

అందాల భామ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయిన సాయి పల్లవి. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగుతో పటు తమిళ్ లో ఈ అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. గ్లామర్ షోకు నో చెప్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది సాయి పల్లవి. ఇటీవల తెలుగులో శేఖర్ కమ్మలు దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ. అలాగే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్ అందుకుంది. ఇక ఈ అమ్మడు అటు తమిళ్ లోనూ స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. రీసెంట్ గా శివకార్తికేయ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాలో ఎంపిక అయ్యింది సాయి పల్లవి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రవ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అందులో భాగంగా తన అభిమాన హీరో ఎవరో కూడా చెప్పేసింది. మీరు ఎక్కువగా ఇష్టపడే హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు.. ఏకంగా ముగ్గురి పేర్లు చెప్పింది పల్లవి. తనకు కమల్ హాసన్, సూర్య, మమ్ముట్టి అంటే చాలా ఇష్టమని.. చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కమల్ హాసన్ అంటే చాలా అభిమానం.. ఇప్పటికే ఆయన సినిమా పోస్టర్స్ ను పేపర్లో కట్ చేసి దాచుకుంటాను అంత అభిమానం అని తెలిపింది సాయి పల్లవి. ఇక ఇప్పుడు ఈ చిన్నది కమల్ నిర్మిస్తున్న సినిమాలోనే ఛాన్స్ దక్కించుకుంది. శివ కార్తికేయన్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సోనీ పిక్చర్స్ తో కలిసి కమల్ హాసన్ ఈ మూవీని నిర్మించబోతుండగా.. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా ఖరారు అయ్యింది. అలాగే తెలుగులో రానా తో కలిసి నటించిన విరాట పర్వం సినిమా త్వరలో విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్

“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్‌ కు చెర్రీ ఎమోషనల్ విషెస్

Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ

 



from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/tciyASd

Baca juga

Post a Comment