Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఆ థియేటర్లలో ఉదయం 4 నుంచే స్పెషల్ షోలు..

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా మహేష్ చిత్రానికి వారం రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతులు ఇచ్చాయి. తాజాగా సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కారు (Telangana Government) మరో గుడ్ న్యూస్ తెలిపింది. సినిమా విడుదల రోజు అంటే మే 12న ఉదయం 4 గంటలకే ఒక స్పెషల్ షో ప్రదర్శించుకేందుకు అనుమతినిచ్చింది. అయితే కేవలం నాలుగు థియేటర్లలో మాత్రమే ఈ స్పెషల్ షోను ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లి కార్జున, విశ్వనాథ్ థియేటర్లు, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో మాత్రమే ఈ స్పెషల్ షోలు వేయనున్నారు. ఇవి కాకుండా ఇతర థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సర్కారు వారి పాట సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా తెలిపారు.
కాగా ఇటీవల మహేశ్ సినిమా రేట్లు పెంచుకునేందుకు ఇరు రాష్ట్రాలు అనుమతులిచ్చాయి. తెలంగాణలో వారం రోజుల పాటు మే 12 నుంచి 18 వరకు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ఉత్తర్వలు జారీ అయ్యాయి. అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు పర్మిషన్ ఇచ్చాయి. కాగా సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ నటిస్తోన్న సర్కారు వారి పాటపై భారీ అంచనాలున్నాయి. గీత గోవిందం లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన పరుశురామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం, ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు, ట్రైలర్లు అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఏ మేరకు రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Pacific Ocean: పసిఫిక్ మహాసముద్రంలో అద్భుతం.. అడుగు బాగాన ‘ఇటుకల రహదారి’.. పూర్తి వివరాలివే..!
Kareena Kapoor Khan: కుర్రహీరోయిన్స్‌కు గట్టిపోటీ ఇస్తున్నసీనియర్ బ్యూటీ
XI Jinping: అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న చైనా అధ్యక్షులు జిన్ జిన్‌పింగ్
from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/a8XWvxS
Post a Comment
Post a Comment