Tortoise : పామనుకొని పొరపడతారేమో… ఇది నిజంగానే తాబేలు.. చూస్తే అవాక్ అవుతారు.

ప్రకృతిలో ఎన్నో వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే జంతువుల విషయంలో ఇలాంటి ఎక్కువగా వింటుంటాం.. చూస్తుంటాం. అయితే తాబేలు అనగానే తెలివైనదని టక్కున గుర్తుకు వస్తుంది. అలాంటి తాబేళ్లు అనేక రకాలుగా ఉంటాయి. అందులో ఈ తాబేలు మరింత ప్రత్యేకమైంది..ఎందుకంటే దీన్నీ చూస్తే ఎవరైనా భయంతో పరుగులు పెడతారు. అదేంటి.. తాబేలు అంటే సాదు జంతువు.. చాలా మంది పెంచుకుంటూ ఉంటారు దాన్ని చూసి భయపడటం ఎందుకు అనుకుంటున్నారా..? ఈ తాబేలుకు ఒక ప్రత్యేకత ఉంది. దీనిని చూస్తే ముందు పాము అనుకుని మొదట భయపడతారు. కానీ, ఆ తర్వాత చూస్తే తెలుస్తుంది..అది పాములాంటి తాబేలు అని..అయితే, అసలే తాబేళ్లు తల బయట పెట్టే సందర్భాలు చాలా తక్కువ. ఎదురుగా ఏదైనా కనబడితే వెంటనే భయంతో తలను దాచుకుంటుంటాయి..పాముల కనబడుతున్న ఈ తాబేలుకు మాత్రం తల దాచుకునేందుకు వీలుండదు..ఎందుకంటే..దీని మెడ మరింత పొడవుగా ఉంటుంది. అందుకే దీన్ని పాము లాంటి మెడ ఉన్న తాబేలు అంటారు. ఈ జాతి జీవుల్లో 16 రకాల దాకా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూ గినియాలో ఉంటాయి. ఇవి తమ మెడతో చేపల్ని గుటుక్కున పట్టుకొని తింటాయి. పెద్ద మెడ కావడం వల్ల దీన్ని తన డిప్పలో దాచుకునేందుకు వీలు కాదు. ఎంత లోపలికి జరుపుకున్నా... ఇంకా చాలా మెడ బయటకే ఉంటుంది. [caption id="attachment_697774" align="alignnone" width="1280"] 2[/caption]   మరిన్ని ఇక్కడ చదవండి :   

from TV9 Telugu- Telugu News, Telugu Samachar https://ift.tt/vhEMp4n

Baca juga

Post a Comment