Dhanush : హాలీవుడ్ సినిమాలో హీరో ధనుష్.. కొడుకులతో కలిసి ప్రీమియర్ షోలో సందడి

తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. ధనుష్ నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇక ధనుష్ కేవలం తెలుగు తమిళ్ మాత్రమే కాదు బాలీవుడ్ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఇటీవలే అక్కడ అత్రింగేరి సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ధనుష్ తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ధనుష్ ఇప్పుడు హాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ మూవీ ది గ్రే మ్యాన్ తో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ధనుష్.
తాజాగా ఈ మూవీ ప్రీమియర్స్ జరిగాయి. లాస్ ఏంజెల్స్లో ఈ కార్యక్రమానికి ధనుష్ తన కుమారులు యాత్ర రాజా లింగ రాజాతో కలిసి హాజరయ్యారు ధనుష్. ఈ సందర్భంగా కుమారులతో కలిసి బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో మెరిశారు ధనుష్. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఒరిజినల్ ఫిల్మ్ ఈ నెల 22న నెట్ ఫ్లిక్స్ ప్లాట్ఫారమ్లో స్ట్రీమింగ్ కానుంది. ది గ్రే మ్యాన్ సినిమాకు ఎవెంజర్స్: ఎండ్ గేమ్ దర్శకత్వం వహించిన రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/NXEkjfh
Post a Comment
Post a Comment