Gold Silver Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Gold Price

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. అయితే.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం (Gold Rate), వెండి ధరలకు బ్రేక్ పడింది. తాజాగా.. పసిడి ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.46,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై రూ.104 మేర తగ్గింది. దేశీయంగా వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి (Silver Rate) ధర రూ.6,100 మేర తగ్గి రూ.56,400 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,950 వద్ద ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,840 వద్ద ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద కొనసాగుతోంది.
  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,400 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.56,400 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.61,700 ఉంది. బెంగళూరులో రూ.61,700, కేరళలో రూ.61,700 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,700, విజయవాడలో రూ.61,700, విశాఖపట్నంలో రూ.61,700 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/BXQScyw

Baca juga

Post a Comment