Health: గోళ్లు కొరికే అలవాటు మంచిదా చెడ్డదా.. నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక అలవాటు ఉంటుంది. అవి మంచివి కావచ్చు. లేక చెడ్డవి కావచ్చు. అయితే మనకు మంచి ఏది.. చెడు ఏది.. అనే విచక్షణ జ్ఞానం తెలుసు కాబట్టి కొన్ని చెడు అలవాట్లను మనం అదుపులో పెట్టుకోగలం. కానీ ఎంత చేసినప్పటికీ కొన్ని చెడు అలవాట్లను మాత్రం నియంత్రించుకోలేం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోళ్లు కొరుక్కోవడం. అవును.. దీనిని మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. ఈ అలవాటు చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు అలవాటుగా ప్రారంభమయ్యే గోళ్లు కొరుక్కోవడం క్రమంగా వ్యసనంలా మారుతుంది. ఈ చెడు అలవాటే మన మానసిక పరిస్థితిపై ప్రభావితం చూపిస్తుంది. సాధారణంగా ఏదైనా విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తే సైకలాజికల్ డిజార్డర్ వల్ల మనం ఎక్కువగా గోళ్ళు కొరుకుతుంటాం. గోళ్లలో సార్మేనేలా, క్లేబ్సిల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా నోటి ద్వారా మన శరీరంలోకి వెళ్తాయని పరిశోధనల్లో తేలింది. ఫలితంగా డయేరియా, ఫుడ్ పాయిజన్, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
కొన్ని పరిశోధన ప్రకారం గోళ్లు కొరకడం అనేది ఆరోగ్యానికి మంచిదని తెలిసింది. ఎందుకంటే గోళ్లు కొరకడం వల్ల మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా సక్రమంగా పని చేయడానికి గోళ్లు కొరికే అలవాటు మంచిదే అంటున్నారు పరిశోధకులు. అయితే అదే పనిగా గోళ్లు కొరికితే మాత్రం దానిని చెడు అలవాటుగానే పరిగణించాలి.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/1keJ2aG
Post a Comment
Post a Comment