Hyderabad: బక్రీద్ సందర్భంగా జరిగే గో హత్యలను అడ్డుకోండి.. యుగ తులసి ఫౌండేషన్ డిమాండ్

Goraksha

ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ (Bakrid) ఒకటి. ఈ పండుగ సందర్బంగా భారీగా జీవహింస జరుగుతందని యుగ తులసి ఫౌండేషన్ నేతలు అంటున్నారు. అంతే కాకుండా బక్రీద్ పండుగను బ్లాక్ డేగా ప్రకటించారు. గో హత్యలను అరికట్టాలంటూ ప్రగతి భవన్ కు (Pragathi Bhavan) ముట్టడికి ర్యాలీగా వెళ్లారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ర్యాలీగా వెళ్తున్న యుగ తులసి సభ్యులను ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ హనుమాన్ టెంపుల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దారుసలామ్ కేంద్రంగా జరుగుతున్న గోహత్యాలను ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్. గోవుల అక్రమ తరలింపును అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఆరోపించారు. గోహత్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. గో రక్షణ కోసం చివరి వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు శివకుమార్.

గో సంరక్షణ చట్టం 1977 తెచ్చినా అది సరిగ్గా అమలు కావడం లేదని వీహెచ్పీ నాయకులు చెబుతున్నారు. బక్రీద్ పండుగ నాడు గో హత్యలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే అని అంటున్నారు. గో హత్యలను అరికడితే హిందూ ముస్లింలు అన్నదమ్ములాగా కలిసి మెలసి ఉండవచ్చని చెప్పారు. ముస్లింలను కొంతమంది ఆ మతానికి చెందిన నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హిందువులపై నోరు పారేసుకునే ముస్లిం నాయకులు గోద్ర, బాబ్రీ మసిద్ ఘటనలు గుర్తు చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/y62LOKR

Baca juga

Post a Comment