Maharashtra: మహారాష్ట్ర సీఎం కీలక నిర్ణయం.. ఆ విషయంలో పోలీసులకు కీలక ఆదేశాలు

మహారాష్ట్ర (maharashtra) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఇంధన ధరలు తగ్గిస్తామన్న షిండే.. ప్రస్తుతం పోలీసులకు ముఖ్యమైన ఆదేశాలిచ్చారు. తన కాన్వాయ్‌కు స్పెషల్ ప్రొటోకాల్ అవసరం లేదన్నారు. కాబట్టి తన కాన్వాయ్ వెళుతున్నప్పుడు ట్రాఫిక్‌ను ఆపవద్దని స్పష్టం చేశారు. ఈ విషయంపై డీజీపీ, కమిషనర్‌తో చర్చించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అలాగే ఇన్‌ఫర్‌మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ జనరల్ కూడా ఓ ట్వీట్ చేసింది. సీఎం కాన్వాయ్ వెళుతున్నప్పుడు సేఫ్టీ కోసం ట్రాఫిక్‌ను బ్లాక్ చేస్తున్నారు. ఇది వాహనదారులకు అసహనం కలిగిస్తుంది. కాబట్టి సీఎం కాన్వాయ్‌కి స్పెషల్ ప్రొటోకాల్ అవసరం లేదని పోలీసులను ఏక్‌నాథ్ ఆదేశించారని ఆ ట్వీట్‌లో పేర్కొంది. షిండే గత నెల 30న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
సీఎంగా తొలిసారిగా ఏక్‌నాథ్ షిండే ఢిల్లీ వెళ్లారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు బీజేపీ ముఖ్య నాయకులను కలిసి కేబినెట్ విస్తరణ ప్లాన్‌ను ఫైనలైజ్ చేయనున్నారు. మరోవైపు, షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి షిండేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడాన్ని ఆ పిటిషన్‌లో సవాల్ చేసింది. పదహారు మంది రెబల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంపై ఎటూ తేలకుండానే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించారని, స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లోనూ వారంతా పాల్గొన్నారని కోర్టుకు తెలిపింది. ఉద్ధవ్ థాక్రే వర్గం ప్రతినిధి సుభాష్ దేశాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక థాక్రే వర్గం మరింత బలహీనపడుతోంది. శివసేన నాయకులు, కార్పొరేటర్లు షిండే వర్గంలో చేరుతున్నారు. దీంతో అసలైన శివసేన తమదేనని షిండే వర్గం వాదిస్తోంది. మరోవైపు, శివసేన నుంచి విల్లు, బాణం గుర్తుని ఎవరూ లాక్కోలేరన్నారు ఉద్ధవ్. దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు రావాలని షిండేకు సవాల్ విసిరారు.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/uFUyX5B
Post a Comment
Post a Comment