Seasonal Diseases: వాతావరణ మార్పులతో విజృంభిస్తున్న వ్యాధులు.. ఈ రెండు కీలకం అంటున్న వైద్యులు..

Seasonal Diseases

Health Tips: దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. వరదలు పోటెత్తడంతో అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల కారణంగా చాలా రాష్ట్రాలు నీట మునిగాయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాతావరణం పూర్తిగా తేమగా ఉంది. అయితే, ఈ వర్షపాతం కారణంగా.. అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో జనాలు అతలాకుతలం అవుతున్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్‌తో పాటు దగ్గు, జలుబు, జ్వరం, అలసట, నీరసం, తలనొప్పి వంటి సమస్యలు సర్వ సాధారణంగా వస్తున్నాయి.

కాగా, వర్షాకాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ కారణంగా వర్షాకాలంలో విపరీతమైన వ్యాధులు మనుషులను సతమతం చేస్తుంటాయి.

మెదాంతా-ది మెడిసిటీ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్, ఆయుర్వేద, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ జి గీతా కృష్ణన్ ప్రకారం.. ‘‘వర్షాకాలంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలలో ఒకటి ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా నీటిని బాగా తాగాలి. ఇది శరీరానికి మేలు చేస్తుంది. అయితే, నీటిని తాగేముందు తప్పకుండా మరిగించాలి. పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గట్ ఇన్‌ఫెక్షన్లు, చర్మ సమస్యలు కూడా వస్తాయి.’’ అని తెలిపారు. అలాగే, మూడు పూటలా భారీగా భుజించడం కంటే.. తక్కువగా తినడం చాలా ముఖ్యం. ఆహారంలో ఎక్కువ ఉప్పు వేయకూడదు. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని డాక్టర్ తెలిపారు.

అధిక తేమ కారణంగా వర్షాకాలంలో జ్వరం రావడం సర్వ సాధారణం అని డాక్టర్ కృష్ణన్ చెప్పారు. ‘ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు.. ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్ అల్లం పొడి కలుపుకుని తాగాలి. అలాగని ప్రతీ రోజూ ఈ కషాయాలను అధికంగా తాగొద్దు. ఇక మంచినీటిలో కొత్తిమీర గింజలు వేసి మరిగించిన నీటిని కూడా తాగొచ్చు. సమస్య ఉన్నప్పుడు మాత్రమే వీటిని తీసుకోవాలి.’ అని డాక్టర్ సూచించారు.

వర్షాల సమయంలో చర్మ సంబంధిత సమస్యలు, ఫంగస్ వంటివి సర్వసాధారణం అని, వీటికి వేప ఆకుల పేస్ట్ అద్భుతంగా పని చేస్తుందని తెలిపారు. ఈ పేస్ట్‌తో చేతులు కడుక్కోవడం, అలెర్జీ ఉన్న చోట రాయడం వలన సమస్య తగ్గుతుందని తెలిపారు.

గొంతు నొప్పికి, బంగారు పాలు – అర కప్పు ,ఇల్క్, ఒక టీస్పూన్ పసుపు పొడి కలిపి తీసుకోవచ్చు. రుచి కోసం కొంచెం తేనె కలుపుకోవచ్చు.

డాక్టర్ పూజా సబర్వాల్ మాట్లాడుతూ..‘‘వర్షాకాలంలో చాలా మంది ప్రజలు గొంతు నొప్పితో బాధపడుతుంటారు. ఆహారం మింగడం, నీరు తాగడంలో సమస్య ఎదుర్కొంటారు. సాధారణంగా దానంతట అదే తగ్గిపోవడానికి ఒక వారం సమయం పడుతుంది. ఆయుర్వేద చికిత్సలతో వేగంగా నయం అవుతుంది. కషాయాలు తాగడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. మిరియాలు(10), అల్లం, తులసి(10 ఆకులు), రెండు గ్లాసుల నీరు. ఇది సగానికి మరిగే వరకు ఉడకబెట్టాలి. ఆ తరువాత చల్లార్చాలి. దీనిని రెగ్యూలర్‌గా తీసుకోవడం వలన త్వరగా ఆ సమస్య నుంచి కోలుకుంటారు.’’ అని తెలిపారు.

ఒక వ్యక్తి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని డాక్టర్ సబర్వాల్ తెలిపారు. ఆయుర్వేదం బాహ్య సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. వ్యాధి మూలాల నుంచి నయం చేస్తుందని డాక్టర్ తెలిపారు. శరీరంలో అసమతుల్యత మూల కారణాన్ని పరిష్కరిస్తుందన్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/ATJ2fDm

Baca juga

Post a Comment