Sri Lanka: శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్తత.. శాంతించని నిరనసకారులు.. ప్రధాని నివాసానికి నిప్పు

Srilanka Crisis

శ్రీలంకలో (Sri Lanka) నెలకొన్ని రాజకీయం సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ప్రధాని పదవికి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేసినట్లు ప్రకటించినప్పటికీ ఆందోళనకారులు శాంతించడం లేదు. తీవ్ర ఆగ్రహంతో అధ్యక్ష నివాసంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. సాయంత్రం ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. కొన్ని వాహనాలనూ ధ్వంసం చేశారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం సైతం వెల్లడించడం గమనార్హం. ముందు వేలాది మంది ఆందోళనకారులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లారు. అయితే, అంతకుముందే ఆయన తన ఇంటి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేశారు. తాజాగా అఖిలపక్ష సమావేశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు ఎక్కువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అధ్యక్షుడు రాజపక్స కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయి.

ఈ పరిణామాలతో కొలంబోలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలో సైనికులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ నిరసన కారుల ఆందోళనలో ఒక సెక్యూరిటీ గార్డు సహా 33 మంది గాయపడినట్లు కొలంబో నేషనల్‌ హాస్పిటల్‌ తెలిపింది. అధ్యక్షుడి ఇంటిలోకి చొచ్చుకువచ్చిన ఆందోళనకారులు.. ఆయన నివాసంలోని స్విమ్మింగ్‌ ఫూల్‌లో స్విమ్మింగ్‌ చేశారు. అధ్యక్షుడు రాజపక్సను ఓ రహస్య ప్రాంతానికి తరలించింది సైన్యం. ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలోని వంటగదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఆహారాలను ఆరగించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/MsULo6N

Baca juga

Post a Comment