What’s Today : ఈ రోజు ఏమున్నాయటే..?

What’s Today
1. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమవేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2. నేడు రాష్ట్రపతి ఎన్నికలు జరిగనున్నాయి. పార్లమెంట్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
3.నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
4. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,400లుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,190లుగా ఉంది.
5. నేటి నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభం కానుంది. ఈ పరీక్షలకు లక్షా 72వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
6. నేడు ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు బయలుదేరనున్న సీఎం కేసీఆర్ కాళేశ్వరం నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరకు పరిశీలిస్తారు.
7. నేడు లష్కర్ బోనాల్లో రంగం కార్యక్రమం జరుగనుంది. భవిష్యవాణి వినిపించనున్న అమ్మవారి భక్తురాలు. తర్వాత అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు.
8. నేటి నుంచి హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు యథాతథంగా నడువనున్నాయి. నేటి నుంచి ఎంఎటీఎస్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
9. తెలంగాణలో నేడు తెరుచుకోనున్న పాఠశాలలు. వర్షాలతో వారం రోజులుగా మూతపడిన సూళ్లు సెలవులు ముగియడంతో నేడు పునఃప్రారంభం కానున్నాయి.
from NTV Telugu https://ift.tt/Zvz9fsK
Post a Comment
Post a Comment