What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్, వెస్టిండీస్‌తో 3 వన్డేలు ఆడనున్న టీమిండియా
* నేడు శ్రీశైలానికి ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్న అంబటి
* నేడు కోనసీమ జిల్లాలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటన, ఆత్రేయపురం, వానపల్లి వరద బాధితులను పరామర్శించనున్న సోమువీర్రాజు
* ఢిల్లీలో నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు, హాజరుకావాలని పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం, అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నట్టు పవన్ సమాచారం
* నెల్లూరు జిల్లా వెంకటాచలం.. పొదలకూరులలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన.
* తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యాటన ముగించుకుని రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు రానున్న నారా చంద్రబాబునాయుడు, ఘనంగా వీడ్కోలు పలకడానికి టీడీపీ శ్రేణుల సన్నాహాలు
* పశ్చిమగోదావరి జిల్లాలో నేడు పాలకొల్లు, నర్సాపురంలో చంద్రబాబు పర్యటన.. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న చంద్రబాబు
* పల్నాడు: నేడు నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
* విశాఖ: నేడు స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర మహాధర్నా … ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చిన పోరాట కమిటీ
* ఆదిలాబాద్ జిల్లాలో నేడు వరద ముంపు ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటన.. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వరదలతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించనున్న సెంట్రల్ టీం
* భద్రాద్రిలో నేడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
from NTV Telugu https://ift.tt/NdnU8eB
Post a Comment
Post a Comment