Horoscope Today: ఈరోజు ఈ రాశివారు వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది.. మంగళవారం రాశి ఫలాలు

Horoscope Today (30-08-2022): నేటికీ చాలామంది ఈ రోజు తమకు ఎలా ఉంటుంది అంటూ మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 30 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) గురించి తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కీలక విషయాల్లో శుభఫలితాలను పొందుతారు. సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అధికంగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అధిక శ్రమపడాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆర్ధికంగా శుభఫలితాలను లభిస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు సత్పలితాలను పొందుతారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శుభఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మేలు. శుభఫలితాలు పొందుతారు. సహనంగా ఉండాల్సి ఉంటుంది. బంధువుల సహకారంతో చేపట్టిన పనుల విషయంలో ముందుకు వెళ్లారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు స్థిర చిత్తంతో పనిచేయాల్సి ఉంటుంది. మిశ్రమ కాలం. కొన్ని పరిస్థితులు బాధను కలిగించడంతో పాటు మానసికంగా ఇబ్బందులను కలిగిస్తాయి.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారికి విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో సంతోషముగా జీవిస్తారు. మంచి నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు సమయానుకూలంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. పట్టుదలతో పనిచేయాల్సి ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ఉత్సాహంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మిశ్రమకాలం. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కలహ సూచన ఉంది. ధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు. చేపట్టిన పనిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. నింద పడాల్సి వస్తుంది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు. ఆర్ధికంగా విజయాలను సొంతం చేసుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/ZFDQwxL
Post a Comment
Post a Comment