HSL Visakhapatnam Jobs 2022: రాత పరీక్షలేకుండా.. విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. రూ.2 లక్షల జీతం..

Hsl Visakhapatnam

HSL Visakhapatnam Senior Manager Recruitment 2022: భారత ప్రభుత్వ డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Hindustan Shipyard Limited).. 55 సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, చీఫ్‌ ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌ తదితర (Senior Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. లీగల్‌, టెక్నికల్‌, కమర్షియల్‌, డిజైన్‌, ప్లాంట్‌ మెయింటెనెన్స్‌, సివిల్‌, సేఫ్టీ, హెచ్‌ఆర్‌, ఐటీ అండ్‌ ఈఆర్‌పీ, ఎలక్ట్రికల్‌, డైవింగ్‌ సిస్టమ్‌, కస్టమ్స్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌/ఎల్‌ఎల్‌బీ/ఇంజినీరింగ్‌ డిగ్రీ/బీఈ/బీటెక్‌/ఎంబీబీఎస్‌/డిప్లొమా/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అలాగే సంబంధిత పనిలో కూడా అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 20, 2022వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 21 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌డిస్కషన్‌, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.39,750ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/IBD1itU

Baca juga

Post a Comment