School Bus Fire: స్కూలు బస్ లో మంటలు.. సురక్షితంగా బయటపడ్డ విద్యార్ధులు

Fire1 (1)

ఉదయాన్నే ఉత్సాహంగా స్కూలుకి వెళుతున్న ప్రైవేట్ స్కూలు బస్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పిల్లలు ఆందోళనకు గురయ్యారు. తమిళనాడులో జరిగిన ఈఘటన ఆందోళన కలిగించించింది. అయితే స్కూలు విద్యార్థులకు పెనుప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడు అరక్కోణం సమీపంలోని సంతమంగళం రైల్వే గేట్ సమీపంలో స్కూల్ వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డారు విద్యార్ధులు. ఒక్కసారిగా మంటలు రావడంతో బస్ లోని స్కూలు విద్యార్ధులు ఆందోళనకు గురయ్యారు.

Read Also: Daggubati Purandeswari: పురందేశ్వరికి బీజేపీ షాక్.. కీలక పదవుల నుంచి తొలగింపు

అయితే, బస్ లో మంటలకు కారణం తెలీలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మంటలు చెలరేగిన విషయం తెలుసుకుని విద్యార్ధుల తల్లిదండ్రులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు. ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మంటలతో ఆ ప్రాంతంలో దట్టమయిన పొగలు వ్యాపించాయి.

Read Also: Dy Cm Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

కల్వకుర్తిలో దొంగల హల్ చల్

కల్వకుర్తిలో దొంగలు హడలెత్తిస్తున్నారు. వరుస దొంగతనాలతో యజమానులు ఉలిక్కిపడుతున్నారు. 24 గంటలు గడవక ముందే మరో చోరీ జరిగింది. కల్వకుర్తి విద్యానగర్ కాలనీ ఆత్మకూరి శ్రీను ఇంట్లో చోరీ జరిగింది. 15 తులాల బంగారం,3.5 లక్షల నగదు దొంగిలించారు దుండగులు. నిన్న అర్ధరాత్రి సమయంలో అదే కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి విష్ణు వర్ధన్ రెడ్డి ఇంట్లో 55 తులాల బంగారం,3 లక్షల నగదు చోరీ అయిన సంగతి తెలిసిందే. ఆచోరీ సంఘటన మరవకముందే మరో చోరీ కావడంతో భయాందోళనకు గురవుతున్నారు విద్యానగర్ కాలనీవాసులు. పోలీసులు నెట్ పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు.



from NTV Telugu https://ift.tt/sS0b2ny

Baca juga

Post a Comment