What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

*హైదరాబాద్ MJ మార్కెట్ లో ముగిసిన నిమజ్జన శోభా యాత్ర…ప్రశాంతంగా ముగిసిన శోభా యాత్ర..గణనాథుని చెంతకు చేరుకున్న గణేష్ విగ్రహాలు

*విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన…జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 4వ జిల్లా మహాసభలో పాల్గొననున్న మంత్రి బొత్స.

* శ్రీకాకుళం జిల్లలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్బంగా ర్యాలీ

* నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు చాతుర్మాసదీక్ష విరమణ

*తూర్పుగోదావరి జిల్లాలో నేటితో ముగియనున్న గణేష్ నవరాత్రి మహోత్సవాలు…ఆఖరి రోజు సందర్భంగా గోదావరిలో భారీగా గణేష్ నిమజ్జనాలు.

*కాకినాడలో నేటితో ముగియనున్న కంచి పీఠాధిపతి చాతుర్మాస్య దీక్ష..అకొండి లక్ష్మీ స్మారక గో శాలలో నిర్వహిస్తున్న దీక్ష నీటి తో 60 రోజులు పూర్తి.

* కాకినాడలో చాగంటి వారి ఆధ్వర్యంలో స్వామీజీ కి పుష్పాభిషేకం,అనంతరం విశ్వ రూప యాత్ర

*గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న 33వ అథ్లెటిక్ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలు

*నేడు తెనాలి మార్కెట్ సెంటర్లో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేడు నాయుడమ్మ విగ్రహావిష్కరణ

*తిరుమలలో ఇవాళ పౌర్ణమి గరుడ సేవ…రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

*విజయవాడలో అంతర్జాతీయ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా ఏపి పోలీస్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ

*నేడు తాడేపల్లిగూడెంలోని NIT స్నాతకోత్సవం..448 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పట్టాల ప్రదానం

*నేడు సంగారెడ్డి జిల్లాలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పర్యటన..పటాన్ చెరులోని బీజేపీ మాజీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఇంటికి రానున్న మిజోరాం గవర్నర్



from NTV Telugu https://ift.tt/In7AWFJ

Baca juga

Post a Comment