Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలెర్ట్‌.. దీపావలి సందర్భంగా వరుసగా 3 రోజుల పాటు సెలవులు.. పూర్తి వివరాలివే

Bank Holidays

అక్టోబర్‌ నెలలో ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయి. దసరాతో సహా ఇతర పండుగల వల్ల ఈ నెల మూడు వారాల్లో పలు రోజులు బ్యాంకులు పని చేయలేదు. ఇక ఈ నెల 17 నుంచి దీపావళి, గోవర్ధన్‌ పూజ, భాయ్‌ దూజ్‌ వంటి పండుగలు, పర్వ దినాలతో బ్యాంకులకు సెలవులు ప్రకటించింది ఆర్బీఐ. అయితే, రాష్ట్రాలు, నగరాల వారీగా బ్యాంకు సెలవుల్లో తేడాలు ఉంటాయి. పలు రాష్ట్రాల్లో స్థానికంగా ముఖ్యమైన పండుగలు ఉంటే బ్యాంకులు మూతపడనున్నాయి. 22 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. 22వ తేదీన నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 23న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. గ్యాంగ్‌టక్‌, హైదరాబాద్‌, ఇంఫాల్‌ నగరాలు మినహా దీపావళి సందర్భంగా ఈ నెల 24న బ్యాంకులకు సెలవు. ఇక దీపావళి సందర్భంగా 25న హైదరాబాద్‌, గ్యాంగ్‌టక్‌, హైదరాబాద్, ఇంఫాల్‌ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈనేపథ్యంలో బ్యాంక్‌ లావాదేవీలు ఉన్న వారు శుక్రవారం తమ పనులు ముగించుకోవడం మంచిది.

అక్కడ మరో మూడు దినాలు క్లోజ్..

ఇక అక్టోబర్‌ 27న భాయ్‌ దూజ్‌ /లక్ష్మీ పూజ సందర్భంగా గాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. ఇక అక్టోబర్‌ 30న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్‌ కానున్నాయి. ఇక అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి / సూర్య షష్ఠి దళ ఛత్ (ఉదయం) / ఛత్ పూజ సందర్భంగా అహ్మదాబాద్, పాట్నా, రాంచీ నగరాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/8N2IV0A

Baca juga

Post a Comment