ESIC Faridabad Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఫరీదాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. 95 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనాటమీ, అనెస్తీషియా, బయోకెమిస్ట్రీ, బ్లడ్ బ్యాంక్, కమ్యునిటీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఐసీయూ, మైక్రోబయోలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రి, పల్మనాలజీ, రేడియో డయాగ్నోసిస్, క్యాజువాలిటీ, యూరాలజీ, ఆంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, డిప్లొమా/డీఎన్‌బీ, ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సెంట్రల్/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అక్టోబర్ 27, 2022వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల నుంచి రూ.1,30,797 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: ESIC Medical College & Hospital, NH-3, N.I.T, Faridabad, Haryana.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/pGStxno
Post a Comment
Post a Comment