Photography: ఈ ఫొటో హారర్‌ మూవీలో సీన్‌లా ఉంది కదూ.. కానీ ఇదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Viral Photo

అందరి కంటికి సాధారణంగా కనిపించే వస్తువులు ఫొటోగ్రాఫర్స్‌ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే వారి కెమెరాలో బంధించగానే వాటికి ఎక్కడలేని ప్రత్యేకత వస్తుంది. ముఖ్యంగా వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌లు తీసే ఫొటోలు చూస్తూంటే ఔరా అనిపించేలా ఉంటాయి. ఇక ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు తీసే ఫొటోల్లో ది బెస్ట్‌ ఫొటోలను ఎంపిక చేసి వారికి అవార్డులు, రివార్డులు అందిస్తుంటారు. తాజాగా ఇలాగే అవార్డు పొందిన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

పైన కినిపిస్తోన్న ఫొటోను లిథువేనియాకు చెందిన యూజెనిజస్‌ కవలియాస్కాస్‌ అనే వైల్డ్‌లైఫ్‌ ఫొటో గ్రాఫర్‌ తీసింది. ఇంతకీ ఈ ఫొటో ఏంటి హారర్‌ మూవీలో సీన్‌లా ఉంది అనుకుంటున్నారు కదూ. అయితే మీరు పొరబడినట్లే ఆ ఫొటో ఒక చీమది. మైక్రోస్కోప్‌ను ఐదురెట్లు పెద్దదిగా చేసి చీమ ఫొటో తీస్తే ఇలా వచ్చింది. ఈ ఫొటోకి నికాన్‌ వరల్డ్ ఫొటోమైక్రోగ్రఫీ 2022 పోటీల్లో బహుమతి లభించింది.

చీమ కదా అనుకుంటే దాని అసలు రూపం ఎలా ఉందో చూశారా.? ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. చీమను దగ్గర నుంచి చూస్తే ఇంత భయంకరంగా ఉంటుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. నికాల్‌ వరల్డ్‌ ఫొటోమైక్రోగ్రఫీ పోటీల్లో ఇలాంటి కంటితో నేరుగా చూడలేని ఫొటోలను అనుమతిస్తారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో 1300 ఫొటోలు ఎంట్రీ ఇవ్వగా అందులో 57 ఫొటోలను ఎంపిక చేశారు. అందులో ఈ భయంకరమైన ఆకరంలో కనిపిస్తోన్న చీమ ఒకటి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/jzADeVB

Baca juga

Post a Comment