T20 World Cup: ప్రపంచకప్ కోసం రక్తం చిందించాం.. పాక్‌తో మ్యాచ్ ముందు ఇన్‌స్పిరేషనల్ వీడియోను షేర్ చేసిన హార్ధిక్

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మొదటి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది. ఇప్పుడా లోటును భర్తీ చేయాలనే తలంపుతో ఆసీస్ వేదికగా జరుగుతున్న పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు సత్తా చాటేందుకు సిద్ధమైంది . అక్టోబర్ 23న అంటే ఆదివారం భారత జట్టు సూపర్ -12లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో పాటు వరల్డ్‌కప్‌ను గెలవాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో అభిమానులు, జట్టులో స్ఫూర్తి నింపేలా టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఒక ఇన్‌స్పిరేషనల్ వీడియోను షేర్ చేశాడు. ఇందులో తన దేశానికి, అభిమానుల కోసం వరల్డ్ కప్ తీసుకోవడానికి తాము అన్ని విధాలా సిద్ధమైనట్లు తెలిపాడు. ‘ఈ జట్టు..ఈ కుటుంబం. అందరికీ అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి మాకు ప్రపంచకప్ మాత్రమే ముఖ్యం. కప్ గెలిచేందుకు రక్తం, చెమటను చిందించాం. ప్రతిదీ అనుభవించాం. ఇప్పుడు ప్రతి అడుగును కౌంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఇందులో చెప్పుకొచ్చాడు హార్ధిక్. ఈ వీడియోలో హార్దిక్‌తో పాటు విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, సూర్యకుమార్ సహా పలువురు స్టార్ ప్లేయర్లు కనిపించారు.
ఫ్యామిలీ సపోర్టుతోనే..
కాగా గతంలో గాయాల బారిన పడి పేలవమైన ఫామ్‌తో జట్టుకు దూరమయ్యాడు. ఆతర్వాత కోలుకుని ఘనంగా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. దీనిపై స్పందిస్తూ ‘ జీవితంలో ప్రతిదానిని సానుకూలంగా తీసుకోవడం, బేసిక్స్‌కు కట్టుబడి ఉండటం చాలా సహాయపడింది. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా చూడడం నా జీవితంలో మనశ్శాంతిని తెచ్చిపెట్టింది. అందరికీ మంచి రోజులు, చెడ్డ రోజులు వస్తాయని నాకు తెలుసు. అయితే కష్టపడి పనిచేయడం వల్ల జీవితంపై సానుకూలత పెరిగింది. ఇది నా మనోధైర్యాన్ని పెంపొందిస్తుంది. ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. గాయాల నుండి కోలుకుంటున్నప్పుడు కుటుంబ సభ్యుల నుంచి ఎంతో మద్దతు లభించింది’ అని చెప్పుకొచ్చాడు పాండ్యా. కాగాఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరచాలంటే.. హార్దిక్ ఎంతో కీలకమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Together
pic.twitter.com/8GHedKhGJF
— hardik pandya (@hardikpandya7) October 21, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/Wd0zGxc
Post a Comment
Post a Comment