Jagadish Reddy: అక్కడి వారిలా తెలంగాణ ప్రజలు మోసపోరు.. ఆ అక్కసుతోనే మోడీ కేసీఆర్‌పై విషం చిమ్మారు..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటన.. రాజకీయాల్లో మరింత వేడి రాజేసింది. రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోడీ.. తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనే లక్ష్యంగా తన ప్రసంగం కొనసాగించారు. తెలంగాణలో కమల వికాసం ఖాయమంటూ.. ఈ సందర్భంగా మోడీ ధీమా వ్యక్తం చేశారు. కాగా.. మోడీ పర్యటన రాజకీయాలను మరింత హీటెక్కించేలా చేసింది. తెలంగాణపై విషం చిమ్మడం తప్ప ప్రధాని మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రధాని మోడీ మునుగోడు ఉపఎన్నికలో ఓటమి పాలయ్యారనే అక్కసుతోనే సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మారంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు హంస లాంటి వారని.. నీళ్లు, పాలను వేరు చేసినట్టు విషాన్ని కూడా వేరు చేస్తారంటూ విమర్శించారు.
నల్గొండ ప్రభుత్వ వైద్యకళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి.. మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. గుజరాత్ ప్రజల్లా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోరంటూ వ్యాఖ్యానించారు. నేతలు, పార్టీలను భయపెట్టి ఎదురు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఏడాది క్రితమే ప్రారంభమై ఎరువులు ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించారంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మడం తప్ప ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిందేమీ లేదంటూ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.
కేంద్రం ఎన్ని దుర్మార్గాలు, అక్రమాలు చేసినా, కేంద్ర ప్రభుత్వం సంస్థలను అడ్డగోలుగా ఉపయోగించినా.. మునుగోడులో ఓడిపోయామన్న అక్కసు తప్ప ప్రధాని మోడీ మాటల్లో కొత్తగా ఏమీ కనిపించలేదంటూ పేర్కొన్నారు. ప్రధాని మోడీ పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మోదీ ఎప్పుడు వచ్చినా తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చిన సందర్భం ఉందా అంటూ విమర్శించారు. వడ్డీతో చెల్లిస్తానన్న మోడీకే ప్రజలు వడ్డీతో సహా ఇస్తారంటూ జగదీశ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
నల్గొండ: మోడీపై మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్.
ప్రతీ అక్షరం కేసీఆర్ పై విషం చిమ్మేలా మోడీ వ్యాఖ్యలు.మునుగోడులో బీజేపీ ఓటమి చెందిందనే మోడీ అక్కసు.
వడ్డీతో సహా ఇస్తారన్న మీకే ప్రజలు తిరిగి చెల్లిస్తారు.
బ్యాంకులోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని అలజడి చేసేందుకు కుట్రలు pic.twitter.com/PIMZEevICY
— Jagadish Reddy G (@jagadishTRS) November 12, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/GJTAihn
Post a Comment
Post a Comment