Munugode Bypoll Results: మరికాసేపట్లో ప్రారంభం కానున్న మునుగోడు ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం ఒంటిగంట లోపు పూర్తి ఫలితం..

మునుగోడు మొనగాడెవరో మరికాసేపట్లో తేలిపోనుంది. తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న మునుగోడు ఓట్ల లెక్కింపు ఇంకాసేపట్లో ప్రారంభంకానుంది. ఇంతకీ, మునుగోడు ఓట్ల లెక్కింపు ఎక్కడ? ఎన్ని రౌండ్లలో జరగనుంది? ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు రానుంది? వివరాలు తెలుసుకుందాం.. మూడు నెలల ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది. ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు, పార్టీల భవితవ్యం మరికొన్నిక్షణాల్లో తేలిపోనుంది. నల్గొండ ఆర్జాలబావిలోని స్టేట్‌వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అందుకోసం 21 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. మొదట పోస్టల్ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు చేస్తారు. ఉదయం 9గంటలకల్లా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ రానుంది. అంటే, కౌంటింగ్ మొదలైన గంటకు మునుగోడు ఓటరు నాడి ఎలాగుందో క్లియర్ పిక్చర్ వచ్చేయనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా మునుగోడు మొనగాడెవరో తేలిపోనుంది. మొదటిగా 686 పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎమ్స్‌ను ఓపెన్ చేస్తారు. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ బూత్స్ ఓట్లను లెక్కిస్తారు.
అలా, మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది. ఫస్ట్… చౌటుప్పల్ మండలం ఈవీఎమ్స్ ఓపెన్‌చేసి లెక్కిస్తారు. తొలి రౌండ్‌లో జైకేసారం గ్రామం ఫలితం రానుంది. చౌటుప్పల్ తర్వాత సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను లెక్కిస్తారు. గంటకు మూడు నుంచి నాలుగు రౌండ్ల ఫలితాలు రానున్నాయ్. మునుగోడు ఉపఎన్నికలో 93.13శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,41,855 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 2,25,192 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముగ్గురు ఢిల్లీ పరిశీలకుల పర్యవేక్షణ.. సీఆర్‌పీఎఫ్ బలగాలు, సీసీ కెమెరాల సమక్షంలో టోటల్ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/9Xfqi7K
Post a Comment
Post a Comment