Waltair Veerayya: వాల్తేర్ వీరయ్యలో స్పెషల్ సాంగ్.. మెగాస్టార్, మాస్ మహారాజాతో ఊర్వశి రౌతేలా మాస్ స్టెప్పులు..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. డైరెక్టర్ బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ ప్రజన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నారు.. అంతేకాకుండా చిత్రంలో చిరంజీవి, రవితేజ ఇద్దరిపై మెగా మాస్ నంబర్ ఉంది. ఈ పాటని ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించారు. అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై భారీ సెట్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. దీనికోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫుట్ ట్యాపింగ్ నంబర్ ను స్కోర్ చేయగా, టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
లావిష్ ప్రొడక్షన్ డిజైన్ కు పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అంచనాలను పెంచుతోంది. తప్పకుండా సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక పండగలా వుంటుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా మెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
రైటింగ్ డిపార్ట్‌మెంట్ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ , మాస్ మాహారాజా కలయికలో రాబోతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/aLIvHq7
Post a Comment
Post a Comment