What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

* ఏపీలోని పెండింగ్ సమస్యలపై కేంద్రం ఫోకస్.. నేడు ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జీవోసీ భేటీ
* నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షపత్రాలు పంపిణీ చేయనున్న సీఎం
* ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్
* ఖమ్మం: నేడు రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో గొత్తికోయల చేతిలో పోడు వివాదంలో హత్యకు గురైన శ్రీనివాసరావు అంత్యక్రియలు.. హాజరుకానున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అధికార లాంఛనాలతో శ్రీనివాసరావు అంత్యక్రియలు
* బాపట్ల: అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున
* నేడు ఢిల్లీలో పర్యటించనున్న మంత్రి విడుదల రజిని
* పల్నాడు: కారంపూడిలో నేటి నుండి ఐదు రోజులపాటు పల్నాటి వీర ఆరాధన ఉత్సవాలు.. మొదటి రోజు రాచగావు, రెండవ రోజు రాయబారం, 3వ రోజు చాపకూడు, నాలుగవ రోజు కోడిపోరు.. 5వ రోజు కల్లిపాడు కార్యక్రమాలు నిర్వహించనున్న ఉత్సవ కమిటీ.
* తిరుమల: రేపు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ.. డిసెంబర్ మాసానాకి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టనున్న టీటీడీ
* అనంతపురం : కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* అనంతపురం : గుంతకల్ రైల్వే డివిజన్ లో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లు మూడు రోజులపాటు పాక్షికంగా రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.
* సత్య సాయి : పుట్టపర్తిలో నేడు సత్యసాయిబాబా 97వ జయంతి.. వేడుకలకు ముస్తాబైన ప్రశాంతి నిలయం. జయంతి వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి కలెక్టరేట్ లో జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం.. రబీ 2022-23కి నీటి విడుదలపై చర్చ
* పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..
* కాకినాడ: అల్ప పీడనం ప్రభావంతో ఉప్పాడ తీరంలో కొనసాగుతున్న అలల ఉధృతి.. తీరం వెంబడి ఈదురుగాలులు, మత్స్యకారులు వేట నిషేధం
* విశాఖ: నేడు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దీపోత్సవం.. వేల సంఖ్యలో తరలిరానున్న భక్తులు, విస్తృత ఏర్పాట్లు
from NTV Telugu https://ift.tt/aNJZbT0
Post a Comment
Post a Comment