Winter Health: చలికాలంలో వేడి నీటి స్నానమా.. ఓ సారి ఆలోచించుకోండి మరి..

Bathing Tips[1]

చలికాలం వచ్చేసింది. గాలులు గజగజ వణిస్తున్నాయి. ఉదయం పది గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. చలి పులి నుంచి తప్పించుకోవడానికి హీటర్లు, చలి మంటలు వంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఇక చలికాలంలో చన్నీటి స్నానమా అనే వారు లేకపోలేదు. ఇందుకు బదులుగా వేడి నీటి స్నానానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శారీరక శుభ్రతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే.. వేడి నీటి స్నానం చేస్తే చలికాలంలో కొన్ని నష్టాలు, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై వేడి నీళ్లను పోసుకోవడం వల్ల చర్మ కణాలకు హాని కలుగుతుంది. ఎందుకంటే ముఖం పై ఉండే చర్మం శరీరం కంటే సున్నితంగా ఉంటుంది. గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల రిలాక్స్‌గా అనిపించవచ్చు. కానీ ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మానికి అనేక సమస్యలు వస్తాయి. వేడి నీరు ముఖాన్ని పొడిగా మారుస్తుంది. అందుకే ముఖంపై వేడి నీటిని ఉపయోగించకపోవడం ఉత్తమం.

శరీరంలో అత్యంత సున్నితమైన చర్మం ముఖంపై ఉంటుంది. చర్మం కింద రక్త నాళాలు, రంధ్రాలు ఉంటాయి. దీంతో వేడి నీటిని ఉపయోగించడం వల్ల చర్మ కణాలకు నష్టం కలుగుతుంది. అంతే కాకుండా ఇది చర్మంపై చికాకు కలిగిస్తుంది. మొటిమల సమస్యకు కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ముఖాన్ని వేడి నీటితో కడగడం వల్ల చర్మంలో సహజసిద్ధమైన నూనెలు తొలగిపోతాయి. తద్వారా చర్మం పొడిగా మారి పగుళ్లు ఏర్పడతాయి. గోరువెచ్చని నీటితో రిలాక్స్‌గా అనిపించినా ఇది చర్మానికి చాలా నష్టాలను కలిగిస్తుంది. ముఖాన్ని వేడి నీటితో కడుక్కోవడం వల్ల చర్మానికి అనేక సమస్యలు వస్తాయి. వేడి నీటిని ఉపయోగించడం వల్ల కొల్లాజెన్ తగ్గుతుంది. దీని వల్ల చర్మం దెబ్బతింటుంది. ఆరోగ్యకరంగా ఉండటానికి తేలికపాటి ఉష్ణోగ్రత ఉన్న నీటిని ఉపయోగించాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/GzsWxhf

Baca juga

Post a Comment