Andhra Pradesh: కందుకూరు ఘటన చాలా బాధాకరం.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: సోము వీర్రాజు

Somu Veerraju

Kandukur Stampede: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరు సభలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సభలో జరిగిన తొక్కిసలాటలో 8మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులు చనిపోవడం బాధకరమంటూ పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధిలా అండగా ఉంటామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

కాగా, ఈ తొక్కిసలాటలో 8 మంది మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమైనప్పటికీ సభలు, సమావేశాలు సందర్భంగా రాజకీయ పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా పోలీస్ యంత్రాంగం కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్ష పార్టీల సభలకు కూడా తగిన విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది రాజకీయ పార్టీ సభ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/vackySY

Baca juga

Post a Comment