Fake Certificates: లక్షన్నరకే పదో తరగతి సర్టిఫికేట్.. దందా వెనుక ఎవరున్నారో తెలిస్తే విస్తు పోవాల్సిందే..

Fake Certificates

ఈజీ మనీ మాత్రమే కాదు.. ఈజీ చదవులు కూడా మన జీవితాలకు ప్రమాదమే. అందులోనూ ఎలాంటి పరీక్షలు రాయకుండా వచ్చే ఫేక్ సర్టిఫికేట్లు మరింత డేంజర్‌. ఈ విషయాన్ని అలస్యంగా అయినా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు అనంతపురం జిల్లాకు చెందిన కొందరు యువకులు. ఫేక్ సర్టిఫికేట్ల మీద ఎన్ని కేసులు నమోదు అవుతున్నా.. ఎంత మంది పట్టుబడుతున్నా.. తగ్గేదే అన్నట్లుగా రెచ్చిపోతాం అంటున్నారు నకిలీగాళ్లు. మరోసారి టెన్త్‌ నకిలీ సర్టిఫికేట్ల బాగోతం బటయపడింది. విజయవాడ ఎస్సార్‌పేట పీఎస్‌ పరిధిలో నకిలీగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఈ ఫేక్ దందాను నడిపిస్తున్నారు. బ్రోకర్స్ ద్వారా వేరు వేరు సెంటర్స్ నుంచి ఫేక్‌ సర్టిఫికేట్స్‌ బిజినెస్‌ ఇష్టానుసారంగా సాగిస్తున్నారు. అయితే విచారణలో అన్నామలై యూనివర్శిటి ప్రతినిధులే ఈ నకిలీ బిజినెస్‌కు పాల్పడుతున్నట్లు తేలింది. వారు లక్షన్నర రూపాయాలు ఇస్టే 10th సర్టిఫికెట్‌లను ఇస్తాం అని వ్యాపారం నడిపిస్తున్నారు.

అయితే ఇది ఫేక్‌ సర్టిఫికేట్‌ అని తీసుకుంటున్న యువకులకు తెలియదు. అన్నామలై వర్సిటీ నుంచి ఇచ్చే ఒరిజినలే అంటూ యువకులను మభ్యపెట్టి వారు అమ్మేస్తున్నారు. అనంతపురానికి చెందిన కొందరు యువకులు ఈ ట్రాప్‌లో చిక్కుకున్నారు. వారు పదో తరగతి ఎగ్జామ్ రాకుండానే పదిరోజుల్లో నేరుగా తమ ఇళ్లకే వచ్చాయి సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికెట్స్‌తో పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాలకు అప్లై చేశారు ఏడుగురు యువకులు. పోస్టల్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్‌లో అవి ఫేక్ సర్టిఫికేట్స్ అని తేలడంతో యువకులను వివరణ ఇవ్వాలని అడిగింది పోస్టల్ డిపార్ట్మెంట్. ఫేక్ సర్టిఫికేట్స్ అని తెలియడంతో ఆందోళనకు గురైన యువకులు బ్రోకర్ ఆనంద్‌ను నిలదీశారు.

విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న అన్నామలై బ్రాంచ్‌కు యువకులు వచ్చి నిలదీయడంతో.. తామిచ్చింది ఒరిజినలే అని.. కావాలంటే ఆన్‌లైన్‌లో చూసుకోవాలని సంబంధిత బ్రోకర్ ఉచిత సలహా ఇచ్చాడు. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు చూపించి.. తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని యువకులు గొడవకు దిగారు. అయితే దాని వల్ల ఫలితం లేకపోయేసరికి నకిలీగాళ్ల ఫేక్‌ దందాపై యువకులు సూర్యారావుపేట పోలీసులకు కంప్లైంట్‌ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సర్టిఫికేట్స్ అమ్మడమే కాదు కొనడం కూడా నేరమే అంటున్నారు. మరోవైపు ఫేక్ సర్టిఫికేట్ల గురించి యూనివర్శిటీ ప్రతినిధులను, బ్రోకర్‌ను, యువకులను పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/PIBtKHg

Baca juga

Post a Comment