IND vs SL: వారంలోనే మారిన ఫాస్ట్ బౌలర్ జీవితం.. వేలంలో రూ.5.5 కోట్లు.. కట్ చేస్తే.. టీమిండియాలోకి పవర్ ఫుల్ ఎంట్రీ..

Ind Vs Sl Mukesh Kumar

Team India IND vs SL: ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ జాతకం వారం రోజుల్లోనే మారిపోయింది. ఇంతకుముందు IPL 2023 మినీ వేలంలో రూ.5.5 కోట్ల భారీ ధరకు ఈ యువ బౌలర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ యంగ్ బౌలర్‌కు భారత జట్టులో కూడా అవకాశం దక్కించుకున్నాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌లో ముఖేష్ కుమార్ భారత జట్టులో భాగమయ్యాడు. జనవరి 3 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన 29 ఏళ్ల ముఖేష్ బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. అతను 2015లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ముఖేష్ ఇప్పటివరకు మొత్తం 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బౌలింగ్ చేస్తూ 21.49 సగటుతో 123 వికెట్లు తీశాడు. ఇది కాకుండా, 24 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో బౌలింగ్ చేస్తూ, అతను 37.46 సగటుతో 26 వికెట్లు తీశాడు. అదే సమయంలో 23 టీ20 మ్యాచుల్లో 23.68 సగటుతో 25 వికెట్లు తీశాడు. ఇందులో అతని ఎకానమీ 7.20గా ఉంది.

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ముఖేష్..

గోపాల్‌గంజ్‌లోని కాకర్‌కుండ్ గ్రామానికి చెందిన ముఖేష్ కుమార్ సాధారణ కుటుంబం. తండ్రి కాశీనాథ్ సింగ్ కోల్‌కతాలో ఆటో నడుపుతుంటాడు. అతని తల్లి గృహిణి. ముఖేష్‌ను ఎంపిక చేయడం వెనుక అతను ఫాస్ట్ బౌలర్ అని, అందుకే అతనిపై నమ్మకం ఏర్పడిందని అంటున్నారు. అతని తండ్రి అనారోగ్యంతో ఇటీవలే మరణించాడు.

మొదటి నుంచి ముఖేష్ క్రికెట్ ఆడటంలో ప్రావీణ్యం సంపాదించాడు. కానీ, బీహార్ నుంచి ఏ జట్టు కూడా రంజీలో భాగం కానందున అతనికి ముందుకు వెళ్ళే మార్గాన్ని ఎంచుకోవడం చాలా కష్టంగా మారింది. ముఖేష్ తండ్రి కోల్‌కతాలో నివసిస్తున్నప్పుడు టాక్సీ నడుపుతుండేవాడు. కాబట్టి, ముఖేష్ అక్కడికి వెళ్లడానికి రిస్క్ తీసుకున్నాడు. కష్టపడి బెంగాల్ జట్టులో స్థానం సంపాదించి దేశవాళీ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. ఆ తర్వాత, ముఖేష్ ఇండియా-ఎ జట్టులో చోటు సంపాదించాడు. ఈ సంవత్సరం భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.

బంగ్లాదేశ్-ఎపై భారత్-ఎలో భాగంగా..

ఇటీవల భారత్-ఎ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఈ ఇండియా-ఎ జట్టులో ముఖేష్ కుమార్ కూడా ఉన్నాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీశాడు. ఇక రెండో మ్యాచ్‌లో 6 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే ఈ వికెట్‌ తీశాడు. ఈ సమయంలో అతను కేవలం 2.52 ఎకానమీతో 15.5 ఓవర్లలో 40 పరుగులు చేశాడు. మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు.

శ్రీలంకతో భారత్ టీ20 జట్టు..

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ ప్లేట్, ఉమ్రాన్ మలిక్ శివమ్ మావి మరియు ముఖేష్ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/uKoN9zV

Baca juga

Post a Comment