Suriya -Jyothika: మరోసారి గొప్పమనసు చాటుకున్న స్టార్ కపుల్.. సూర్య- జోతిక చేసిన సాయానికి సలాం చేయాల్సిందే..

Suriya Jyothika

తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య సినిమా వస్తుందంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. సూర్య కు తెలుగులోనూ మంచి ఫాలోయిన్ ఉంది. చాలా కాలంగా సూర్య సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సుధా కొంగారు దర్శకత్వలో వచ్చిన ఆకాశంమే నీ హద్దు సినిమాతో  మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా కరోనా నేపథ్యంలో ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తర్వాత జై భీమ్ అనే సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఇక సూర్య సేవాకార్యక్రమాల్లోనూ ముందుంటాడు. ఇప్పటికే పలు ఛారిటీలు నిర్వహిస్తున్నాడు సూర్య. తన సతీమణి తో కలిసి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాగే ఏదైనా ఆపద సమయంలోనూ ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తాడు.

తాజాగా మరో సారి మంచి మనసు చాటుకున్నారు. గత కొన్నేళ్లుగా చెన్నై కి చెందిన పేద పిల్లల చదవుల కోసం అదంగరం ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తున్న సూర్య దంపతులు తాజాగా మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు.సూర్య నటించిన జై భీమ్ సినిమా తర్వాత గిరిజన పిల్లల చదువుల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు సూర్య, జోతిక.

తాజాగా కోటి రూపాయలు అందజేసి మంచి మనసుని చాటుకున్నారు. పళన్ కుడి ఇరులర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా కోటి రూపాయల చెక్కుని సూర్య జ్యోతిక విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/3VxfNi6

Baca juga

Post a Comment