Tunisha Sharma: బాలీవుడ్‌లో విషాదం.. షూటింగ్ సెట్‌లోనే నటి ఆత్మహత్య..!

Tanisha Sharma

Tunisha Sharma: బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ టీవీ నటి తునీషా శర్మ(21) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనీషా సీరియల్ షూటింగ్ సెట్‌లో టాయిలెట్‌కి వెళ్లి బయటకు రాలేదు. తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై వలీవు పోలీసులు కేసు నమోదు చేశారు.ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు. ఆత్మహత్యతో పాటు హత్య కోణంలోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

Read also: Booster Dose: ఈ విషయంలో దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు టాప్

తునీషా మృతి చెందిన సమయంలో సెట్‌లో ఉన్న వారందరినీ పోలీసులు విచారిస్తున్నారు. ప్రముఖ టీవీ షో ‘అలీ బాబా దస్తాన్’లో నటి తునీషా శర్మ మరియా షెహజాదీగా నటించింది. ఆమె ‘భారత్ కా వీర్ పుత్ర- మహా రాణా ప్రతాప్’ అనే చారిత్రాత్మక సీరియల్‌తో టెలివిజన్‌కు పరిచయమైంది.ఆ తర్వాత, ఆమె చక్రవర్తి అశోక్ సామ్రాట్, గబ్బర్ పూంచ్‌వాలా, షేర్-ఎ-పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్, ఇంటర్నెట్‌వాలా లవ్, ఇష్క్ శుభనాల్లా సీరియల్‌లలో కనిపించింది. టీవీ సీరియల్స్‌తో పాటు, ఆమె ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2, దుర్గా రాణి సింగ్, దబాంగ్ 3 వంటి సినిమాల్లో నటించింది. దబాంగ్ 3లో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రలో నటించింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఆరు గంటల ముందు, తునీషా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సెట్స్ నుండి వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో, ఆమె సెట్‌లో షూటింగ్ కోసం మేకప్ చేస్తూ కనిపించింది. సెట్‌లో ఈ తెరవెనుక వీడియోకు ఆమె ‘స్టే ట్యూన్’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
Booster Dose: ఈ విషయంలో దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు టాప్



from NTV Telugu https://ift.tt/q6ULBe1

Baca juga

Post a Comment