YS Jagan-Amit Shah: హోం మంత్రి అమిత్ షాతో నేడు సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపైనే చర్చ?

Cm Jagan

AP CM YS Jagan – Union Home Minister Amit Shah: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాలతో ఈ భేటీ నేటికి వాయిదా పడింది. అంటే గురువారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర హోం మంత్రితో సమావేశం కానున్నారు. కాగా, ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధితోపాటు పలు విషయాలపై చర్చించనున్నారు. కాగా, బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిసి 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశామయ్యారు.

ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ సుధీర్ఘంగా ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధితో పాటు రాజకీయ అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే సీఎం జగన్ ప్రధానంగా ప్రధాని మోడీతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల అదేవిధంగా ఏపీకి రావాల్సిన నిధులు తదితర అంశాలపై మోడీకి వివరించారు. దీంతోపాటు విభజన సమస్యలు, మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికలకు సీఎం జగన్ ఇప్పటి నుంచే సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ శ్రేణులను కూడా సంసిద్ధం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/IQAscpN

Baca juga

Post a Comment