IND Vs SL: లెక్క సరిచేసిన శ్రీలంక.. పోరాడి ఓడిన టీమిండియా

IND Vs SL: పూణె వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక దంచికొట్టింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 190 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ (51) రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
Read Also: Covid 19: షాకింగ్ న్యూస్.. పురుషుల వీర్యం నాణ్యత, సంతానోత్పత్తిపై కరోనా ప్రభావం..
భారీ లక్ష్య సాధనలో టీమిండియా ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (2), శుభ్‌మన్ గిల్ (5) దారుణంగా విఫలమయ్యారు. తొలి అంతర్జాతీయ టీ20 ఆడుతున్న రాహుల్ త్రిపాఠి కూడా 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (12), దీపక్ హుడా (9) కూడా విఫలం కావడంతో టీమిండియా పరాజయం ఖరారైంది. సూర్యకుమార్ ఉన్నా రన్‌రేట్ పెరిగిపోవడంతో ఆశలు సన్నగిల్లాయి. అయితే అక్షర్ పటేల్ అనూహ్యంగా రాణించడంతో విజయం ఆశలు చిగురించాయి. సూర్యకుమార్, అక్షర్ పటేల్ జోడీ బౌండరీలు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 42 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు.
from NTV Telugu https://ift.tt/fdacnyX
Post a Comment
Post a Comment