Samantha: మళ్లీ ఆ పని చేస్తే కానీ మాములు మనిషిని కాను

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకొంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఈ మధ్యనే యాక్టివ్ అయ్యింది. రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టి అభిమానులను అలరిస్తోంది. తాజాగా సామ్ శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సామ్ అభిమానులకు దగ్గరవుతోంది. ఇక తాజగా సామ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ” నా బాధకు నా పిచ్చికి నేను నా ప్రపంచంలో కోల్పోయిన వాటన్నింటికీ కళనే నాకు మందు.. దాని సహాయం వల్లనే నేను మళ్ళీ తిరిగి నా గమ్యానికి చేరుకోగలుగుతాను” అంటూ చెప్పుకొస్తూ శాకుంతలం డబ్బింగ్ చెప్తున్నట్లు హింట్ ఇచ్చింది.
ప్రస్తుతం ఆమె మానసికంగా ఎంతో కుంగిపోయింది. పనిలో పడితే కానీ ఆమె కోలుకోదు అని అర్ధం అవుతోంది. ఇక త్వరలోనే సామ్ ఈ వ్యాధి నుంచి బయటపడనుంది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ సైతం ఆమె లైఫ్ కు చక్కగా సరిపోతోంది. కొత్త ఏడాది కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయనుంది సామ్. ఆమె చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అవన్నీ సామ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక్కసారి అమ్మడు పనిలో పడింది అంటే వీటన్నింటిని మార్చురిపోగలదు. ఎందుకంటే సామ్ ఎంతో దైర్యమున్న మహిళ. ఇక ఆమె అభిమానులు ఎలాగూ ఆమెకు తోడుగా ఉంటూనే వస్తున్నారు. మరి సామ్ ఇకముందు ఎలా ఉండబోతుందో చూడాలి.
from NTV Telugu https://ift.tt/Pxa7em4
Post a Comment
Post a Comment