Harmanpreet Kaur: ‘స్కూల్ గర్ల్ మిస్టేక్’.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన టీమిండియా కెప్టెన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం (ఫిబ్రవరి24) ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఒకానొక స్థితిలో గెలిచేలా కనిపించిన టీమిండియా ఆమె రనౌట్ కాగానే వరుసగా వికెట్లు కోల్పోయింది. రన్‌రేట్ భారం కూడా పెరిగిపోవడంతో 5 పరుగుల తేడాతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మైదానంలోకి దిగిన హర్మన్ 34 బంతుల్లో 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. అయితే, 14.4 ఓవర్‌లో రెండో పరుగు తీసే క్రమంలో దురదృష్టకర రీతిలో రనౌట్ అయింది. సులువుగానే క్రీజులోకి చేరుకుంటుందన్నట్లు కనిపించినా బ్యాట్ స్టక్ అయిపోవడంతో.. అప్పటికే బంతిని అందుకున్న హేలీ బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. ఇదే మ్యాచ్‌ను టీమిండియా నుంచి దూరం చేసింది. ఈ క్రమంలోనే హర్మన్ రనౌట్‌పై ప్రముఖ కామెంటేటర్ నాసిర్ హుస్సేన్ గేలిచేస్తూ మాట్లాడాడు.. ‘ కాస్తైనా పరిణతి లేకుండా చిన్న పిల్ల మాదిరి ఏంటిది అన్న అర్థంలో స్కూల్ గర్ల్ ఎర్రర్’ అంటూ లైవ్‌లో వ్యాఖ్యానించాడు. ఇంత సిల్లీగా కూడా అవుటవుతారా అని నెగెటివ్ కామెంట్లు చేశాడు.
దీనిపై స్పందించిన హర్మన్ ‘ ఆయన అలా అన్నాడా? మంచిది. నాకు తెలియదు. ఇది ఆయన ఆలోచనా విధానం. మ్యాచ్‌లలో కొన్నిసార్లు ఇది జరుగుతుంది. క్రికెట్‌లో బ్యాటర్లు పరుగు కోసం వెళ్లి బ్యాట్ ఇరుక్కుపోయినప్పుడు ఇలా జరగడం నేను చాలాసార్లు చూశాను. ఆసీస్‌తో మ్యాచ్‌లో మా ప్రదర్శన బాగానే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిపోయింది. ఇక రనౌట్ విషయానికొస్తే.. ఆయనన్నట్లు అదేమీ స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదు. మేము పరిణతి కలిగిన ఆటగాళ్లమే. నేను గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా. నేను ఔట్ కాకుండా క్రీజులో చివరి వరకు ఉండి ఉంటే.. ఒక ఓవర్ ముందుగానే మ్యాచ్ ముగించేవాళ్లం’ అని నాసిర్‌కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/tqAc75b
Post a Comment
Post a Comment