Joe Biden: ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించదు..

Joe Biden: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది కావస్తోంది. కాగా, సోమవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలో చర్చలు జరిపారు. సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకునే నియంత ఎప్పటికీ ప్రజల స్వేచ్ఛను తగ్గించలేదని, ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని అన్నారు. ఉక్రెయిన్ పర్యటన ముగిసిన తర్వాత పోలాండ్ వచ్చిన బైడెన్ అక్కడి ప్రజలు, ఉక్రెయిన్ శరణార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
Read Also: Extramarital Affair: భార్య వివాహేతర సంబంధం.. వేర్వేరు గదుల్లో ఉండగా..
ఉక్రెయిన్ కు తమ మద్దతు కొనసాగుతుందని.. మిత్రపక్షాలతో కలిసి ఆ దేశానికి అండగా నిలుస్తామని అన్నారు. రాబోయే రోజులకు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ బలంగా ఉందని ఆయన అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రసంగంపై కూడా బైడెన్ స్పందించారు. పుతిన్ చెప్పినట్లు పశ్చిమ దేశాలు రష్యాపై దాడి చేయడానికి కుట్ర చేయడం లేదని స్పష్టం చేశారు. తమ పొరుగువారితో జీవించాలనుకునే మిలియన్ల మంది రష్యన్లు మాకు శత్రువులు కారని అన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుదాతో భేటీ అయ్యారు బైడెన్. నాటో కూటమి మునుపెన్నడు లేనంత బలంగా ఉందని అన్నారు. అమెరికాకు పోలాండ్, నాటో ఎంత అవసరమో, నాటోకు అమెరికా అంత అవసరం అని అన్నారు. ఉక్రెయిన్ లో బైడెన్ ఆకస్మికంగా పర్యటించడాన్ని ఆండ్రెస్ పొగిడారు. ఉక్రెయిన్ లో ఇది చాలా ధైర్యా్న్ని నింపుతుందని అన్నారు.
from NTV Telugu https://ift.tt/U1aJlBu
Post a Comment
Post a Comment