Rivaba: నా భర్తకు నాకంటే క్రికెటే ఎక్కువ.. షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ సతీమణి

Ravindra Jadeja's Wife Riva

గాయంతో కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. అయితే అదే సందర్భంలో తన సతీమణి రివాబాకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో తీవ్ర విమర్శలకు గురయ్యాడు. అయితే జడేజాకు అన్నిటికంటే క్రికెటే ఎక్కవంటోంది రివాబా. ఆటపై తనకు అమితమైన అంకిత భావం ఉందని, చివరకు తనకంటే క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీలో అదరగొడుతున్నాడు జడేజా. తన స్పిన్‌ బౌలింగ్‌తో ఆస్ట్రేలియన్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు. ఈక్రమంలోనే జడేజా రీఎంట్రీపై మాట్లాడిన రివాబా ‘జడేజాకు క్రికెటే తొలి ప్రాధాన్యత.. ఆ తరువాతే నేను’ అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ‘జడేజా గాయం నుంచి కోలుకోని తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆటపై చాలా నిబద్దతలో ఉంటాడు. అదే తన బలం. దేశం తరపున ఆడడానికే తొలి ప్రాధాన్యమిస్తాడు. సాధారణంగా జడేజా చాలా తక్కువగా మాట్లాడతాడు. తనను విమర్శించేవారికి తన ఆటతోనే సమాధానం చెబుతాడు. తన లోపాల మీద దృష్టి పెడుతూ ముందుకు సాగుతాడు. ప్రాధాన్యత విషయంలో క్రికెట్‌ తర్వాతే నేను’ అని రివాబా చెప్పుకొచ్చింది.

ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు జడేజా. బంతి, బ్యాట్‌తో రాణించి రెండు మ్యాచ్‌ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తద్వారా సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. కాగా భారత్, ఆసీస్‌ జట్ల మధ్య మూడో మూడో టెస్టు మార్చి1 న ఇండోర్ వేదికగా జరగనుంది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కు చేరుకోవాలంటే ఈ టెస్టులోనూ టీమిండియా గెలవాల్సి ఉంది. ఈక్రమంలో జడేజా ఇదే జోరును కొనసాగించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..



from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/JlxMTy2

Baca juga

Post a Comment