Sachin: అరంగేట్రం పాక్ జట్టుతో.. తొలి మ్యాచ్ భారత్‌తోనే.. కపిల్ క్యాచ్ మిస్ చేసిన సచిన్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం..

Sachin Tendulkar: భారత జట్టు మాజీ వెటరన్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలో తనదంటూ ఓ ముద్ద వేశాడు. 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్ నవంబర్ 1989లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్ ముగించే సమయంలో క్రికెట్‌లో దేవుడు అనే బిరుదు తెచ్చుకున్నాడు. అయితే సచిన్ టెండూల్కర్ భారత్ తరపున అరంగేట్రం చేయడానికి ముందు పాకిస్థాన్ జట్టు తరపున ఆడాడని మీకు తెలుసా?
సచిన్ భారత్ కంటే ముందు పాకిస్థాన్ తరపున ఆడాడు..
సచిన్ టెండూల్కర్ 13 ఏళ్ల వయసులో ఫీల్డర్‌గా అరంగేట్రం చేశాడు. సచిన్ ఈ అరంగేట్రం భారత్ నుంచి కాకుండా పాకిస్థాన్ నుంచి చేశాడు. సచిన్ జనవరి 20, 1987న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో పాకిస్థాన్ తరపున ఫీల్డర్‌గా అరంగేట్రం చేశాడు. ఆ రోజు భారత్, పాకిస్థాన్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) స్వర్ణోత్సవం సందర్భంగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్ తరపున ఆడాడు.
పాకిస్థాన్‌కు ఫీల్డర్లు లేకపోవడంతో..
ఈ మ్యాచ్‌లో, జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ లంచ్ సమయానికి మైదానం నుంచి బయటకు వెళ్లారు. దీని కారణంగా పాకిస్తాన్‌లో ఒక ఫీల్డర్ తక్కువగా ఉన్నాడు. దీంతో సచిన్ టెండూల్కర్ ఫీల్డింగ్ కోసం మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సచిన్‌ను లాంగ్ ఆన్‌లో ఉంచారు. కపిల్ దేవ్ అదే దిశలో షాట్ ఆడాడు. దానిని టెండూల్కర్ క్యాచ్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’లో పేర్కొన్నాడు.
ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఇమ్రాన్ ఖాన్ తనను లాంగ్ ఆన్‌లో కాకుండా మిడ్‌ఆన్‌లో ఉంచితే క్యాచ్ పట్టేవాడినని స్నేహితుడికి ఫిర్యాదు చేశానని టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.
మాస్టర్ బ్లాస్టర్ కెరీర్ ఇలా..
సచిన్ టీమిండియా తరపున మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలోని 782 ఇన్నింగ్స్‌లలో 48.52 సగటుతో 34357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/8qVOwb1
Post a Comment
Post a Comment