What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Today Events February 20, 2023
* ఈరోజు తారక రత్న అంత్యక్రియలు..ఉదయం 9 గంటలకు ఇంటి దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు బౌతిక కాయం..మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ లోనే తారక రత్న భౌతిక కాయం..3.30 తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు
*శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి వసంతోత్సవం.
*నేడు సీపీఐ రాష్ట్ర నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు పరిశీలన యాత్ర.. ఉదయం 9 గంటలకు రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ నుండి బయలుదేరనున్న సీపీైఐ బృందం
* శ్రీకాకుళంలో నేడు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో ముగుయనున్న శివరాత్రి వేడుకలు…వంశధార నదిలో చక్రతీర్ద స్నానాలు ఆచరించనున్న లక్షలాది మంది భక్తులు…ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
*విశాఖలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు
*ఒంగోలు లోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో ప్రాంతీయ వాదం, దక్షిణ భారత దేశంలో ప్రాంతీయ ఉద్యమాలు అనే అంశంపై సెమినార్
*నెల్లూరులోని ఇందిరా భవన్ లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు.. పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.
*నేడు ఉట్నూర్ ఐ టి డీ ఏ ముట్టడికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపు.ఎస్టీ జాబితా లో నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్
from NTV Telugu https://ift.tt/vES1nzd
Post a Comment
Post a Comment