Lavanya Tripathi: నా పెళ్లి జరుగుతుంది కానీ.. లావణ్య త్రిపాఠి ఆసక్తికర కామెంట్స్

హీరోయిన్స్ పెళ్లికు సంబంధించి నిత్యం ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. మూడు పదాలు దాటుతున్న చాలా మంది భామలు పెళ్లి పేరు ఎత్తడం లేదు. కానీ వీరి పెళ్లి పై నెటిజన్లకు , అభిమానులకు మాత్రం ఆత్రం ఆగదు. ఈ క్రమంలోనే రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంటాయి. అలాగే క్రేజీ బ్యూటీ లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి కూడా వార్తలు వచ్చాయి. ఈ భామ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉంది గతంలో వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరు కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించారు. ఆసమయంలోనే ప్రేమలో పడ్డారని టాక్. ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన హ్యాండ్సమ్ హీరో ఎవరు అని ఒక షోలో అడగ్గా వరుణ్ తేజ్ అని టక్కున చెప్పింది ఈ చిన్నది. దాంతో ఆ ప్రేమ రూమర్స్ కు మరింత బలం చేకూరింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ అమ్మడి పెళ్ళికి సంబంధించి మరోసారి వార్తలు రావడంతో స్పందించింది. ఇటీవల లావణ్య త్రిపాఠి నటించిన పులి మేక సిరీర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
నా పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయడం లేదు. కాబట్టి నేను కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. పెళ్లికి సంబంధించి నేనేమి కలలు కనడం లేదు. ప్రస్తుతం నా ఫుల్ ఫోకస్ సినిమాలపైనే ఉంది. నా పెళ్లి జరుగుతుంది కానీ అది నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/hE40gR6
Post a Comment
Post a Comment