Saif Ali Khan : లిమిట్స్‌లో ఉండాలి.. ఫోటోగ్రాఫర్స్ తీరుపై సైఫ్ అసహనం.. ఆ రూమర్స్ పై క్లారిటీ..

సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా సినీతారలకు చెందిన వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇక వారికి సంబంధించిన ఫోటోస్ గురించి చెప్పక్కర్లేదు. సినిమాలు.. ఈవెంట్లలోనే కాదు.. ఇంట్లో వాళ్లు ఏం చేస్తుంటారు అని తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆరాటపడుతుంటారు. సెలబ్రెటీల ఫోటోస్ తీసుకునేందుకు ఫోటోగ్రాఫర్స్ చూపించే ఉత్సాహం గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోహీరోయిన్స్ వెంట కెమెరామెన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే. ఇటీవల ఫోటోగ్రాఫర్స్ తీరుపై పలువురు సినీతారలు అసహనం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా వ్యక్తిగత ఫిక్చర్స్ ఎలా తీస్తారంటూ సోషల్ మీడియా వేదికగా అలియా భట్ సీరియస్ కాగా.. ఇటీవల హీరో సైఫ్ అలీ ఖాన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల తన భార్య కరీనా కపూర్‌కు ఓ ఈవెంట్ కు హాజరైన సైఫ్ దంపతుల వెంట ఫోటోగ్రాఫర్స్ పడ్డారు. వారిని వెంబడిస్తూ గేట్ దాటి ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో వారి తీరుపై సైఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఇంకెందుకు మా బెడ్ రూంలోకి కూడా వచ్చేయండి అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ ఘటనతో సైఫ్ తన ఇంటి సెక్యూరిటీ గార్డును తొలగించడమే కాకుండా.. ఫోటోగ్రాఫర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారంటూ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు సైఫ్.
“దాదాపు 20 మంది ఫోటోగ్రాఫర్స్ మా ఇంట్లోకి ప్రవేశించి ఫోటోస్ కావాలంటూ వెంటపడ్డారు. ఈ విషయంలో మా బిల్డింగ్ సెక్యూరిటీ తప్పు లేదు. కనుక అతడిని విధుల నుంచి తొలగించడం లేదు. అలాగే ఫోటోగ్రాఫర్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ.. వాళ్లు మా గేటులోంచి సెక్యూరిటీని కాదని ఇంట్లోకి వచ్చేసి 20 కెమెరాలు మాపై వేసి ఫోటోస్ తీసేందుకు ట్రై చేయడం చాలా తప్పు. ఇది సరైన ప్రవర్తన కాదు. ఎవరైనా లిమిట్స్ లో ఉండాలి. మేము కెమెరామెన్స్ కు సహకరిస్తాము. అది బయట మాత్రమే ఇంట్లో కాదు. వాళ్లు లిమిట్స్ క్రాస్ చేశారు. అందుకే సీరియస్ అయ్యాను. మా పిల్లలు ఎక్కడ కనిపించినా వారిని ఫోటోస్ తీస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. అందుకే ఎవరి విషయంలో అయినా లిమిట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి ” అంటూ వివరణ ఇచ్చారు సైఫ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
from TV9 Telugu News Latest Telugu News and Telugu Breaking News and LIVE Updates - TV9 Telugu https://ift.tt/z3SqEKl
Post a Comment
Post a Comment